CBSE Revised Time Table 2026: సీబీఎస్ఈ పరీక్ష తేదీల్లో మార్పులు

CBSE Revised Time Table 2026:

CBSE (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) ఇటీవల విడుదల చేసిన 2026 బోర్డ్ ఎగ్జామ్స్ కి సంబంధించి కొన్ని మార్పులు చేసింది. మార్చి 3 వ తేదీన జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది. ఈ CBSE Revised Time Table 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

మార్చి 3, 2025వ తేదీ జరగవలసిన CBSE (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) 10వ తరగతి మరియు 12వ తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేయడం జరిగింది. మార్చి 3వ తేదీన జరగవలసిన 10వ తరగతి పరీక్ష ను మార్చి 11వ తేదీకి వాయిదా వేశారు.

మార్చి 3వ తేదీ న జరగవలసిన 12వ తరగతి బోర్డు పరీక్షలను ఏప్రిల్ 10, 2026వ తేదీకి మార్పు చేశారు. మిగిలిన తేదీలను ఎటువంటి మార్పులు చేయలేదని, యధావిధిగా పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 17, 2026వ తేదీ నుండి ప్రారంభమవుతాయి. 10వ తరగతి పరీక్షలు మార్చి 18, 2026 వ తేదీ వరకు జరుగుతాయి. 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 10, 2026వ తేదీ వరకు జరుగుతాయి.

సీబీఎస్ఈ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరుగుతాయి.

పరిపాలనపరమైన కారణాలవల్ల సీబీఎస్ఈ మార్చి 3 వ తేదీన జరగవలసిన పరీక్షలను వాయిదా వేసింది. అయితే మిగతా పరీక్షలు యధాతధంగా ఆ తేదీల్లో జరుగుతాయని తెలిపింది.

Official Website: https://www.cbse.gov.in/

Leave a Comment