RBI Office Attendant Notification 2026: 10వ తరగతి అర్హత

RBI Office Attendant Notification 2026 In Telugu

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నుండి ఆఫీసు అటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ RBI Office Attendant Notification 2026 In Telugu ద్వారా 572 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ RBI Office Attendant Notification 2026 ద్వారా

నేమ్ ఆఫ్ ఆఫీసుఖాళీల సంఖ్య
అహ్మదాబాద్29
బెంగళూరు16
భూపాల్4
భువనేశ్వర్36
చండీగర్2
చెన్నై9
గువాహతి52
హైదరాబాదు36
జైపూర్42
కాన్పూర్ & లక్నో125
కోల్కత్తా90
ముంబై33
న్యూఢిల్లీ 61
పాట్నా37
మొత్తం ఖాళీలు572

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 572 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ RBI Office Attendant Notification 2026 కోసం అభ్యర్థులు జనవరి 15, 2026వ తేదీ నుండి ఫిబ్రవరి 4, 2026 వ తేదీ మధ్య ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

పదవ తరగతి అర్హతతో రైల్వేలో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.

Age Limit:

జనవరి 1, 2026 వ తేదీ నాటికి 18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

(అంటే అభ్యర్థులు 2001 జనవరి 2వ తేదీ నుండి 2008 జనవరి 1 వ తేదీల మధ్య పుట్టి ఉండాలి.)

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరంల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

ఫిజికల్లీ హ్యాండీక్ప్డ్ అభ్యర్థుల్లో జనరల్ మరియు ఏడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబిసి అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన ఉంది.

Educational Qualification:

జనవరి 01, 2026వ తేదీ నాటికి పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

అలాగే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే, ఏ స్టేట్ కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ స్టేట్ కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.

హైదరాబాదుకు అప్లై చేయాలి అంటే తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.

హైదరాబాదులో మొత్తం 36 పోస్టులను భర్తీ చేస్తుండగా అందులో 22 పోస్టులకి ఆంధ్రప్రదేశ్ వారు అర్హులు.

గ్రాడ్యుయేషన్ మరియు అంతకంటే హైయర్ క్వాలిఫికేషన్ కలిగిన వారు ఈ నోటిఫికేషన్ కి అనర్హులు.

Selection Process:

ఆన్లైన్ టెస్ట్ మరియు లాంగ్వేజ్ ప్రొఫెషియన్సీ టెస్ట్ ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఆన్లైన్ టెస్ట్

సబ్జెక్టుప్రశ్నలుమార్కులు
రీజనింగ్3030
జనరల్ ఇంగ్లీష్3030
జనరల్ అవేర్నెస్3030
న్యూమరికల్ ఎబిలిటీ3030
మొత్తం120120

ఈ ఆన్లైన్ టెస్ట్ అనేది 120 ప్రశ్నలకు గాను 120 మార్కులు చొప్పున మొత్తంగా 90 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. పరీక్ష అనేది తెలుగులో ఉంటుంది.

లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్: ఆన్లైన్ టెస్ట్ తర్వాత లాంగ్వేజ్ ప్రొఫెన్సీ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ లాంగ్వేజ్ ప్రొఫెన్సీ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే.

Examination Centers:

ఆంధ్రప్రదేశ్: చీరాల, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు/విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం

తెలంగాణ: హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్

How To Apply:

ఈ RBI Office Attendant Notification 2026 నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు జనవరి 15, 2026వ తేదీ నుండి ఫిబ్రవరి 4, 2026వ తేదీ మధ్య https://opportunities.rbi.org.in/ వెబ్సైటులో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత అప్లై చేసుకోవాలి.

Application Fee:

ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 450+18% GST రూపాయలు నీ అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 50+ 18% GST చెల్లిస్తే సరిపోతుంది.

Salary:

ఈ RBI Office Attendant Notification 2026 కి సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకి నెలకి రూ.24,250 – రూ. 53550 మధ్య జీతం ఉంటుంది. అన్ని కలుపుకొని నెలకి 46,029 రూపాయల జీతం వస్తుంది.

Notification

Official Website: https://opportunities.rbi.org.in/

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

WhatsApp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment