స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) నోటిఫికేషన్ కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముఖ్య సమాచారం. ఎంటిఎస్ ఎగ్జామ్ స్లాట్ బుక్ చేసుకోవడానికి విండో ఓపెన్ అయ్యింది. ఈ SSC MTS Slot Booking 2026 In Telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) & హవాలార్ నోటిఫికేషన్ జూన్ 26, 2025వ తేదీన విడుదల కావడం జరిగింది. ఈ SSC MTS Notification కోసం అభ్యర్థులు జూన్ 26, 2025వ తేదీ నుండి జూలై 24, 2025వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకున్నారు.
ఈ SSC MTS Notification 2025 ద్వారా
మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS) – 6810 పోస్టులను
హవాల్దార్ – 1211 పోస్టులను
మొత్తంగా 8021 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
పదవ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు
ఈ SSC MTS Exams ఫిబ్రవరి 4, 2026వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.

SSC MTS Slot Booking 2026 In Telugu
అయితే ప్రస్తుతం SSC MTS Exams కి సంబంధించి Self slot Booking window ఓపెన్ అయింది. అభ్యర్థులు తమ Exam City, Exam Date మరియు Shift ను బుకింగ్ చేసుకోవాలి. అయితే ఈ SSC MTS Slot Booking 2026 ఎలా చేసుకోవాలో చూద్దాం.
అభ్యర్థులు ఈ లింకుపై క్లిక్ చేయండి – ssc.gov.in
తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ మరియు క్యాప్చ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేసి లాగిన్ అవ్వండి.
లాగిన్ అయిన తర్వాత “మై అప్లికేషన్” పై క్లిక్ చేయండి.
మై అప్లికేషన్ లో మీరు అప్లై చేసుకున్న నోటిఫికేషన్ ల వివరాలు మొత్తం కనబడతాయి.
ఎస్ఎస్సి ఎంటిఎస్ నోటిఫికేషన్ దగ్గర క్రింద “సెలెక్ట్ సిటీ, ఎగ్జామ్ డేటు, షిఫ్టు” అని ఆప్షన్ కనపడుతుంది. దానిపై క్లిక్ చేయండి.
మీరు నోటిఫికేషన్ కి అప్లై చేసుకునేప్పుడు ఇచ్చిన మూడు సిటీ నేమ్స్ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఒక సిటీ నీ ఎంచుకోండి.
తర్వాత Block – 1, Block – 2, Block – 3 అని మూడు Block లు ఓపెన్ అవడం జరుగుతుంది.
ఫిబ్రవరి 4, 5,6 తేదీల్లో ఎగ్జామ్ రాయాలి అంటే Block – 1 ను ఎంచుకోండి.
ఫిబ్రవరి 9, 10, 11, 12, 13 తేదీల్లో ఎగ్జామ్ రాయాలి అనుకుంటే Block – 2 ను ఎంచుకోండి.
ఫిబ్రవరి 16, 17, 18, 19 తేదీల్లో ఎగ్జామ్ రాయాలి అనుకుంటే Block – 3 నీ ఎంచుకోండి.
అభ్యర్థులు పై విధంగా తమ స్లాట్ ను జనవరి 25, 2026 వ తేదీ లోగా బుక్ చేసుకోవాలి.
SSC MTS Slot Booking ను అందరూ చేస్కోవాలి. ఎవరైనా స్లాట్ బుక్ చేస్కోపోతే జనవరి 28, 2026 వ తేదీన మీ నుండి ఫిడ్ బాక్ అడగడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ ను రాయాలి అనుకుంటున్నారా, లేదా అని అడగడం జరుగుతుంది. మీరు రెస్పాండ్ కాకపోతే మీ అడ్మిట్ కార్డు జనరెట్ చేయరు.
కాబట్టి SSC MTS Notification 2025 కి అప్లై చేసుకున్న వారు అందరూ కచ్చితంగా తమ ఎగ్జామ్ కి స్లాట్ బుక్ చేసుకోవాలి.
ఎవరైతే ఫలానా టైం లో ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారో వారికి ఈ స్లాట్ బుకింగ్ అనేది మంచి అవకాశం.
Official Website: ssc.gov.in
ఇటువంటి లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |