CSIR-CLRI Recruitment 2026
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) కింద పని చేస్తున్నటువంటి సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ (CLRI), చెన్నై నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ కి 10వ తరగతి అర్హతతో కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ CSIR – CLRI Recruitment 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ CSIR – CLRI Recruitment 2026 కోసం అభ్యర్థులు జనవరి 23, 2026 వ తేదీ నుండి మార్చి 2, 2026వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ఈ CSIR – CLRI Recruitment 2026 ద్వారా
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) – 6(UR-3, OBC-2 & EWS-1)
జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్(ఫైనాన్స్ & అకౌంట్స్) – 1(ఎస్సీ)
జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ (స్టోర్ & పర్చేజ్) – 3 (UR-2, OBC(బ్యాక్లాగ్)-1)
జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్(జనరల్) – 2(UR)
జూనియర్ స్టెనోగ్రాఫర్ – 1(UR)
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 13 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.

Age Limit:
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): 18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్: 18 సంవత్సరముల నుండి 28 సంవత్సరముల మధ్య వయసును కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
జూనియర్ స్టెనోగ్రాఫర్: 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో అన్ రిజర్వ్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబిసి అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
10వ తరగతి అర్హతతో రైల్వేలో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
Educational Qualification:
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్(ఫైనాన్స్ & అకౌంట్స్): 10+2 / XII ను అకౌంటెన్సీ సబ్జెక్టుతో పాస్ అయి ఉండాలి. అలాగే కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలి.
జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ (స్టోర్ & పర్చేజ్)/(జనరల్): 10+2 / XII ను పాస్ అయి ఉండాలి. అలాగే కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలి.
జూనియర్ స్టెనోగ్రాఫర్: 10+2 / XII పాస్ అయి ఉండాలి. అలాగే స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి.
Selection Process:
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): రిటర్న్ ఎగ్జామినేషన్ ను నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
మిగిలిన పోస్టులను రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు స్కిల్ టెస్ట్ ను నిర్వహించి భర్తీ చేస్తూ ఉన్నారు.
How To Apply:
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆన్లైన్లో recruitment.clri.org వెబ్సైటులో జనవరి 23, 2026వ తేదీ నుండి మార్చి 2, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి.
Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Salary:
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): ఈ ఉద్యోగాలు లెవెల్ 1 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు బేసిక్ పే Rs.18000 – 56900 రూపాయల మధ్య ఉంటుంది. అన్నీ కలుపుకొని నెలకు 35,973 రూపాయల జీతం వస్తుంది.
జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్: ఈ ఉద్యోగాలు లెవెల్ 2 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకు బేసిక్ పే Rs.19900 – 63200 రూపాయల మధ్య జీతం ఉంటుంది. అన్ని కలుపుకొని నెలకు 39,545 రూపాయల జీతం వస్తుంది.
జూనియర్ స్టెనోగ్రాఫర్: ఈ ఉద్యోగాలు లెవెల్ 4 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే నెలకు బేసిక్ పే Rs.25500 – 81100 రూపాయల మధ్య ఉంటుంది. అన్ని కలుపుకొని 53,628 రూపాయల జీతం వస్తుంది.
Official Website: https://clri.org
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు మీకు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |