TS Court Notification 2026
తెలంగాణ రాష్ట్రం నుండి జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతలతో అప్లై చేసుకోవచ్చు. ఈ TS Court Notification 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ TS Court Notification 2026 కోసం అభ్యర్థులు జనవరి 24, 2026 వ తేదీ నుండి ఫిబ్రవరి 13, 2026 వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
ఈ TS Court Notification 2026 ద్వారా
| పోస్ట్ పేరు | ఖాళీలు |
| ఆఫీసు సబార్డినేట్ | 319 |
| ప్రాసెస్ సర్వర్ | 95 |
| రికార్డు అసిస్టెంట్ | 36 |
| కాపీఈస్ట్ | 63 |
| ఎగ్జామినేర్ | 48 |
| ఫీల్డ్ అసిస్టెంట్ | 61 |
| టైపిస్ట్ | 42 |
| జూనియర్ అసిస్టెంట్ | 159 |
| స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – 3 | 35 |
| మొత్తం పోస్టులు | 858 |
ఈ TS Court Notification 2026 ద్వారా 858 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ పోస్టుల డిస్ట్రిక్ట్ వైస్ వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
Age Limit:
జూలై 1, 2026వ తేదీ నాటికి 18 సంవత్సరముల నుండి 46 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
10వ తరగతి అర్హతతో రైల్వేలో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.

Educational Qualification:
ఆఫీసు సబార్డినేట్: 7వ తరగతి నుండి 10వ తరగతి మధ్య ఎంత చదివినా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అయితే అభ్యర్థులు 10వ తరగతి కన్నా ఎక్కువ చదివి ఉండకూడదు.
ప్రాసెస్ సర్వర్: 10వ తరగతి పాస్ అయి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
రికార్డు అసిస్టెంట్: ఇంటర్మీడియట్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
కాపీఈస్ట్: ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలా అని ఇంగ్లీషు టైపు రైటింగ్ లో హైయర్ గ్రేడ్/లోవర్ గ్రేడ్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి.
ఎగ్జామినేర్: ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఫీల్డ్ అసిస్టెంట్: బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
టైపిస్ట్: అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీ పాసయి ఉండాలి. అలాగే ఇంగ్లీషు టైపు రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. అలాగే కంప్యూటర్ ఆపరేషన్స్ లో నాలెడ్జ్ కలిగి ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్: బ్యాచిలర్స్ డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – 3: అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ టైపు రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. ఇంగ్లీషు షార్తాండ్ హయ్యర్ గ్రేడ్/లోవర్ గ్రేడ్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. అలాగే కంప్యూటర్ ఆపరేషన్స్ పైన నాలెడ్జి కలిగి ఉండాలి.
Selection Process:
పోస్టును బట్టి రిటర్న్ ఎగ్జామ్ మరియు స్కిల్ టెస్ట్ ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్స్ లో చూసుకోండి.
How To Apply:
ఈ TS Court Notification 2026 కోసం అభ్యర్థులు జనవరి 24, 2026వ తేదీ నుండి ఫిబ్రవరి 13, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో https://tshc.gov.in వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాలి.
Application Fee:
ఈ TS Court Notification 2026 కి అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థులు 600 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టి, ఈడబ్ల్యూఎస్ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 400 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్స్ లో చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి.
Official Website: https://tshc.gov.in
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |