10వ తరగతి అర్హతతో 28,740 పోస్టల్ ఉద్యోగాలు! Postal GDS Recruitment 2026

Postal GDS Recruitment 2026

పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి గ్రామీణ డాక్ సేవక్(GDS) నోటిఫికేషన్ విడుదల అయింది. 10వ తరగతి పాస్ అయి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ Postal GDS Recruitment 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఈ Postal GDS Recruitment 2026 ద్వారా బ్రాంచ్ పోస్టు మాస్టర్(BPM)/అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ABPM)/డాక్ సేవక్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ Postal GDS Recruitment 2026 ద్వారా 28,740 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ Postal GDS Recruitment 2026 కోసం అభ్యర్థులు జనవరి 31, 2026 వ తేదీ నుండి ఫిబ్రవరి 14, 2026 వ తేదీల మధ్య ఆన్లైన్లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫిబ్రవరి 2, 2026వ తేదీ నుండి ఫిబ్రవరి 16, 2026వ తేదీల మధ్య ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిషన్ చేసి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అప్లికేషన్లో ఏవైనా తప్పులు ఉంటే ఫిబ్రవరి 18, 2026వ తేదీ నుండి ఫిబ్రవరి 19, 2026వ తేదీ మధ్య కరెక్ట్ చేసుకోవాలి.

10వ తరగతి అర్హతతో రైల్వేలో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

Age Limit:

18 సంవత్సరముల నుండి 40 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

ఫిజికల్లి హండికాప్డ్ అభ్యర్థుల లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

Educational Qualification:

10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఏ రాష్ట్రానికి అయితే అభ్యర్థులు అప్లై చేస్తారో ఆ రాష్ట్రానికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.

రాష్ట్రం వారీగా పోస్టులు:

రాష్ట్రంపోస్టులు
ఆంధ్రప్రదేశ్1060
అస్సాం639
బీహార్1347
చత్తిస్గర్ 1155
ఢిల్లీ42
గుజరాత్1830
హర్యానా270
హిమాచల్ ప్రదేశ్520
జమ్మూ అండ్ కాశ్మీర్267
ఝార్ఖండ్908
కర్ణాటక1023
కేరళ1691
మధ్యప్రదేశ్2120
మహారాష్ట్ర3553
నార్త్ ఈస్టర్ను1014
ఒడిశా1191
పంజాబ్262
రాజస్థాన్634
తమిళనాడు2009
తెలంగాణ609
ఉత్తర ప్రదేశ్3,169
ఉత్తరాఖండ్445
వెస్ట్ బెంగాల్2,982

Selection Process:

మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ చేస్తారు.

How To Apply:

ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అఫిషియల్ వెబ్సైట్ https://indiapost.gov.in లో

ఆన్లైన్ వన్ టైం రిజిస్ట్రేషన్ – జనవరి 31, 2026 – ఫిబ్రవరి 14, 2026

ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ – ఫిబ్రవరి 2, 2026 – ఫిబ్రవరి 16, 2026.

Application Fee:

ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 100 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

మహిళలు, ఎస్సీ, ఎస్టి, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Salary:

BPM – Rs.12,000/- to Rs.29,380/-

ABPM/Dak Sevak – Rs.10,000/- to Rs.24,470/-

Notification

Official Website: https://indiapost.gov.in/

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

WhatsApp ChannelClick Here
Telegram Channel Click Here

1 thought on “10వ తరగతి అర్హతతో 28,740 పోస్టల్ ఉద్యోగాలు! Postal GDS Recruitment 2026”

Leave a Comment