బంగారు, వెండి ధర గత నాలుగు రోజుల నుండి పడిపోతూ వస్తుంది. ఈ సందర్భంగా బంగారు, వెండి ప్రియులు ఆనందం తెలియపరుస్తున్నారు. ఈరోజు 03 February 2026 Gold, Silver Prices కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ప్రస్తుతం శుభకార్యాలు పెట్టుకున్న వారికి శుభవార్త. గత నాలుగు రోజుల నుండి బంగారం మరియు వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఎలాగైతే ధరలు పైకి ఎగబాకాయో అదేవిధంగా కిందికి పడిపోతున్నాయి.
ఈరోజు బంగారు ధర 24 క్యారెట్ల 10 గ్రాములకు గాను 1,420 రూపాయలు తగ్గి 1,51,750 రూపాయల వద్ద కొనుగోలు అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాములకు గాను 1300 రూపాయలు తగ్గి 1,39,100 రూపాయల వద్ద కొనుగోలు అవుతోంది.
అయితే గత ఐదు రోజుల క్రితం లక్ష 80 వేలకు పైగా బంగారు ధర పలికింది. ఈ 4 రోజుల్లోనే 30 వేల రూపాయలు బంగారు విలువ పతనమయింది.
అదేవిధంగా ఈరోజు వెండి కిలో పై 20వేల రూపాయలు పతనమై 2,80,000 రూపాయలు పలుకుతోంది.
గత నాలుగు రోజుల క్రితం ఇదే వెండి కిలో ధర 4 లక్షలకు పైగా చేరుకుంది. నాలుగు రోజుల్లోనే 40 శాతం ధరలు పతనమయ్యాయి.
ఇటువంటి లేటెస్ట్ న్యూస్ వివరాలు మరియు జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |