IDBI Bank JAM Recruitment 2026
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) నుండి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) – గ్రేడు – ఓ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ IDBI Bank JAM Recruitment 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ IDBI Bank JAM Recruitment 2026 ద్వారా 1100 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. జోన్ వైజ్ గా పోస్టులను చూస్తే..
| జోన్ | పోస్టులు |
| అహ్మదాబాద్ | 70 పోస్టులు |
| బెంగళూరు | 75 పోస్టులు |
| భోపాల్ | 55 పోస్టులు |
| భువనేశ్వర్ | 50 పోస్టులు |
| చండీగర్ | 70 పోస్టులు |
| చెన్నై | 70 పోస్టులు |
| ఢిల్లీ | 130 పోస్టులు |
| గువాహతి | 35 పోస్టులు |
| హైదరాబాదు | 65 పోస్టులు |
| కొచ్చి | 55 పోస్టులు |
| కోల్కత్తా | 60 పోస్టులు |
| లక్నో | 85 పోస్టులు |
| ముంబై | 130 పోస్టులు |
| నాగపూర్ | 50 పోస్టులు |
| పాట్నా | 45 పోస్టులు |
| పూణే | 55 పోస్టులు |
| మొత్తం | 1100 పోస్టులు |
రాష్ట్రాల వారీగా జోన్ ను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి. అలాగే కేటగిరి వైజ్ పోస్టులను కూడా అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
ఈ IDBI Bank JAM Recruitment 2026 కోసం అభ్యర్థులు మార్చి 8, 2026వ తేదీ నుండి మార్చి 19, 2026వ తేదీ మధ్య ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
10060 పోస్టులతో ఏపీ జాబ్ క్యాలెండర్
Age Limit :
మార్చి 01, 2026వ తేదీ నాటికి 20 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
అంటే అభ్యర్థులు 2 మార్చి 2001వ తేదీ నుండి మార్చి 1, 2006వ తేదీల మధ్య పుట్టి ఉండాలి.
ఎస్సీ మరియు ఎస్టి అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
60 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 55 శాతం మార్పులతో పాసై ఉంటే సరిపోతుంది.
Selection Process:
- ఆన్లైన్ ఎగ్జామినేషన్
- పర్సనల్ ఇంటర్వ్యూ
- మెడికల్ ఫిట్నెస్
ఆన్లైన్ ఎగ్జామినేషన్: 200 ప్రశ్నలకు గాను 200 మార్కులు చొప్పున 120 నిమిషాల పాటు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది.
ఏప్రిల్ 12, 2026వ తేదీన ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది.
Examination Centres:
ఆంధ్రప్రదేశ్: చీరాల, ఏలూరు, గుంటూరు/విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం
తెలంగాణ: హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
How To Apply:
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి www.idbi.bank.in లో మార్చి 8, 2026వ తేదీ నుండి మార్చి 19, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి.
Application Fee:
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థులు 1050 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 250 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
పూర్తిగా నోటిఫికేషన్ ను చదివిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.
Official Website: https://www.idbi.bank.in/
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |