ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దీనివలన రాష్ట్రంలోని ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఈ AP Job Updates 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం సమీపం తుర్లువాడాలో 266 ఎకరాలతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి శంకుస్థాపన పూర్తయింది.
పది, ఇంటర్, డిగ్రీ అర్హత తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.
1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. ఏడాదికే ఈ గూగుల్ డేటా సెంటర్ ను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
అయితే ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ వలన రాష్ట్రంలోని నిరుద్యోగ యువత లాభ పడింది. ఈ డేటా సెంటర్ ఏర్పడిన తర్వాత 2 లక్షల వరకు ఉద్యోగాలు ఏర్పడతాయని అంచనా.
ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది కేవలం ప్రాజెక్టు కాదు, జనరేషన్ షిఫ్ట్, గూగుల్ లో సెర్చ్ చేసినవి అని ఇక్కడ ఉంటాయని నారా లోకేష్ X లో తెలిపారు.
లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |