ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది. మత్స్యకారుల అకౌంట్లో 20,000 రూపాయలను జమ చేసింది. Matsyakarula Sevalo Scheme ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ సహాయం అందిస్తోంది.
ఏప్రిల్ నెల నుండి జూన్ నెల వరకు చేపలకు సంతానోత్పత్తికి మంచి సమయం. ఈ సమయంలో చేపలు తమ సంతాన ఉత్పత్తిని బాగా ఉత్పత్తి చేసుకుంటాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు 60 రోజుల కాలం పాటు సముద్ర తీరాన ఎవరు చేపల వేట చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చట్టరీత్యా నిషేధం చేసింది.
ఈ సందర్భంగా చేపల వేటపై ఆధారపడి జీవించే వారికి పని లేకుండా పోతుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపల వేట ద్వారా జీవించే మత్స్యకారుల అకౌంట్లో 20,000 రూపాయలను వేయడం జరిగింది.
ఈ మత్స్యకారుల సేవలో పథకం ద్వారా రాష్ట్రంలోని 1,30,796 మత్స్యకారుల అకౌంట్లో 20వేల రూపాయలను జమా చేయడం జరిగింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 262 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.
గత సంవత్సరం ఈ పథకం ద్వారా 1,21,433 మంది మత్స్యకారులు లాభపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం 243 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.