NPCIL Recruitment 2026
NPCIL Recruitment 2026: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఇంటర్ అర్హతతో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ NPCIL నోటిఫికేషన్ ద్వారా
ప్లాంట్ ఆపరేటర్ -136 పోస్టులు
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ – 15 పోస్టులు
ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ – 15 పోస్టులు
ఎలక్ట్రీషియన్ – 47 పోస్టులు
ఫీట్టర్ – 30 పోస్టులు
టర్నర్ – 5 పోస్టులు
మెచినిస్ట్ – 5 పోస్టులు
వెల్డర్ – 2 పోస్టులు
మొత్తంగా 225 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. కేటగిరి వైజ్ గా పోస్టులను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
10వ తరగతి అర్హతతో MTS ఉద్యోగాలు.
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు జూన్ 8, 2026వ తేదీ నుండి జూన్ 29, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి.
Age Limit:
18 సంవత్సరముల నుండి 24 సంవత్సరంల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
అంటే అభ్యర్థులు జూన్ 29, 2002 వ తేదీ నుండి జూన్ 29, 2008వ తేదీ మధ్య పుట్టిండాలి.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
ప్లాంట్ ఆపరేటర్: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మరియు ఇంగ్లీషు సబ్జెక్టుల్లో 12th క్లాసు చదివిన వారు ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు.
మిగిలిన పోస్టులకి పదవ తరగతి చదివి, రిలవెంట్ ట్రేడ్ లో 2 సంవత్సరముల ఐటిఐ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
ఒక సంవత్సరం ఐటిఐ చేసిన వారు అప్లై చేసుకోవాలి అంటే ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
మినిమం హైట్: 160 CM
మినిమం వెయిట్: 45.5 KG
Selection Process:
ప్రిలిమినరీ టెస్ట్ మరియు అడ్వాన్సుడ్ టెస్ట్ ను నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
How To Apply:
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి https://www.npcilcareers.co.in లో జూన్ 8, 2026వ తేదీ ఉదయం 10 గంటల నుండి జూన్ 29, 2026వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు అప్లై చేసుకోవాలి.
Application Fee:
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 100 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Official Website: https://www.npcilcareers.co.in
2 thoughts on “ఇంటర్ అర్హతతో 225 ఉద్యోగాలు: NPCIL Recruitment 2026”