తెలంగాణ ఎంసెట్ ఫలితాలు! TG EAPCET Results 2026

TG EAPCET Results 2026: తెలంగాణ ఎంసెట్ పరీక్ష రాసిన వారికి ముఖ్య గమనిక. తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఫలితాలు మే 17, 2026వ తేదీ ఆదివారం నాడు విడుదల కానున్నాయి. అభ్యర్థులు పరీక్షా ఫలితాలను ఈ విధంగా చూసుకోండి.

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగం పరీక్షలు మే 4 మరియు 5 వ తేదీన నిర్వహించడం జరిగింది. ఈ అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగం పరీక్షలకు 84,954 మంది విద్యార్థులు రాయడం జరిగింది.

ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు మే 9 నుండి 11 వరకు జరిగాయి. ఇంజనీరింగ్ విభాగం పరీక్షలకు 1,97,241 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది.

ఉపాధి హామీ పనిలో కీలక మార్పులు

మొత్తంగా అగ్రికల్చర్, ఫార్మసీ మరియు ఇంజనీరింగ్ విద్యార్థులు అందరూ కలుపుకొని ఈ ఎంసెట్ పరీక్షలు 2,82,195 మంది విద్యార్థులు రాయడం జరిగింది.

TG EAPCET Results 2026

ఈ తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఫలితాలు మే 17, 2026వ తేదీ ఆదివారం నాడు విడుదల కానున్నాయి. ఫలితాలు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి.

ఫలితాలు విడుదల అవగానే అభ్యర్థులు అఫీషియల్ వెబ్ సైట్ అయినటువంటి https://eapcet.tgche.ac.in/ లో తమ రాంకు కార్డును చూసుకోండి.

Leave a Comment