AP Govt: 3వ బిడ్డ పుడితే 30 వేలు, 4వ బిడ్డ పుడితే 40 వేలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు లేదా నలుగురు పిల్లలను కనాలి అనుకునే తల్లిదండ్రులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త తెలిపారు. మూడవ బిడ్డ పుడితే 30 వేల రూపాయలు, 4వ బిడ్డ పుడితే 40 వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.

శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. 5 వారాల కార్యక్రమాన్ని ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరిట ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జూన్ నాటికి రాష్ట్రంలో ఎక్కడ చెత్త లేకుండా చేయనున్నారు.

SBI లో 7150 పోస్టులు

కలెక్టర్లు, మంత్రులు మరియు ఎమ్మెల్యేలు గ్రామస్థాయిలో, క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు.

ఇకనుండి మూడవ బిడ్డ పుడితే 30,000, నాలుగవ బిడ్డ పుడితే 40 వేలు అందజేస్తామని తెలియజేశారు. తల్లిదండ్రులు పిల్లలను భారంగా భావించవద్దని పేర్కొన్నారు.

అలాగే ప్రతి సంవత్సరం తల్లికి వందనం పథకం కింద అందజేస్తున్న 15,000 రూపాయలను భవిష్యత్తులో పెంచుతామని తెలిపారు.

Whatsapp Channel

Leave a Comment