ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బక్రీద్ పండుగ సెలవును మే 27 నుండి మే 28 కి మార్చడం జరిగింది. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్ష తేదీలో మార్పులు జరిగాయి. మార్పుల గురించి పూర్తి వివరాలు చూద్దాం.
ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్యాలెండర్ లో బక్రీదు పండుగ సెలవును మే 27, 2026వ తేదీన సెలవు ఇవ్వడం జరిగింది. అయితే పండుగ మే 28వ తేదీన కావున మరలా తేదీని మార్చడం జరిగింది. ఈ సందర్భంగా మే 28వ తేదీన జరగవలసిన ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడ్డాయి.
మే 28వ తేదీన జరగవలసిన ఇంటర్మీడియట్ పరీక్షలను జూన్ 5వ తేదీకి వాయిదా వేయడం జరిగింది.
12,256 సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.
వాయిదా పడిన సబ్జెక్టు లు పరీక్షలు
మొదటి సంవత్సరం:
ఎకనామిక్స్ పేపర్ – 1
ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ – 1
బయాలజీ – 1
రెండవ సంవత్సరం:
సెకండ్ ఇయర్ మాథ్స్ 2
ఒకేషనల్ కోర్సు మ్యాథ్స్ పేపర్ – 2
బయాలజీ పేపర్ – 2
మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. రెండవ సంవత్సరం పరీక్షలు 2:30 నుండి 5:30 వరకు నిర్వహించడం జరుగుతుంది.
హాల్ టికెట్ కావాలి అంటే విద్యార్థులు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://bie.ap.gov.in/లో లేదా మనమిత్ర వాట్సాప్ నెంబర్ అయినటువంటి 9552300009 లో డౌన్లోడ్ చేసుకోండి.
Official Website: https://bie.ap.gov.in/