TG New Ration Card 2026
TG New Ration Card 2026: కొత్త రేషన్ కార్డుల పంపిణీకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయ్యింది. ఈ కొత్త రేషన్ కార్డులు ఎలా ఉండనున్నాయో చూద్దాం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాగితపు రేషన్ కార్డులను తొలగించి నూతనంగా ఏటీఎం కార్డు తరహాలో రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా నూతన రేషన్ కార్డులను ఆగస్టు 15, 2026 వ తేదీ నుండి పంపిణీ చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో జరిగే కార్యక్రమంలో ఈ రేషన్ కార్డుల పంపిణీనీ ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 15 నుండి ఆగస్టు 30 వ తేదీ వరకు 15 రోజుల పాటు రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు.
మీ గ్యాస్ కనెక్షన్ కు ఈకేవైసీ కచ్చితంగా చేసుకోండి
రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ రేషన్ కార్డుల ద్వారా 3.43 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు.
రేషన్ కార్డులు ఎలా ఉండనున్నాయి?

రేషన్ కార్డు పంపిణీ నేపథ్యంలో ప్రభుత్వం మోడల్ కార్డును విడుదల చేయడం జరిగింది. ఈ కార్డు ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ఫోటోలు, కుటుంబం యొక్క యజమాని పేరు, రేషన్ కార్డు నంబర్, రేషన్ షాప్ నంబర్ వివరాలు ఉంటాయి.
మరోవైపు హొలోగ్రామ్, క్యూఆర్ కోడ్ తో పాటు, జిల్లా, మండలం, గ్రామం వంటి అడ్రస్ వివరాలు ఉంటాయి.