ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు సువర్ణ అవకాశం. సొంత స్థలం కలిగి ఇల్లు కట్టుకోవడానికి డబ్బు లేని వారికి ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పిస్తోంది.
PMAY-G(ప్రధాన మంత్రి ఆవాస్ యోజన -గ్రామీణ) పథకం కింద అర్హులైన గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలను మరియు రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 రూపాయలను మొత్తంగా 2,50,000 రూపాయలను ఈ పథకం కింద అందజేయనున్నారు.
ఈ పథకానికి సంబంధించి తొలుత చివరి తేదీ నవంబర్ 30, 2025 ఉండేది అయితే ఈ తేదీని డిసెంబర్ 14వ తేదీకి పొడిగించడం జరిగింది.
ఈ PMAY-G పథకం కోసం డిసెంబర్ 14, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. ఈ PMAY-G కి సంబంధించి ఎలిజిబులిటీ వివరాలు చూద్దాం.
PMAY-G Eligibility in telugu:
రేషన్ కార్డు, ఆధార్ కార్డును కలిగి ఉండాలి.
ఇల్లు కట్టుకోవడానికి స్థలం కలిగి ఉండాలి. (భూమి పత్రాలు కలిగి ఉండాలి.)
బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి.
సొంత ఇంటిని కలిగి ఉండకూడదు.
కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితులకు లోబడి ఉండాలి.
How To Apply:
ఈ PMAY-G కి ఎలా అప్లై చేయాలి అంటే. గ్రామ వార్డు సచివాలయం వద్దకు వెళ్లి అవసరమైన పత్రాలను సమర్పించి, అప్లై చేసుకోవాలి.
సచివాలయంలోని సర్వేయర్ మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చి స్థలాన్ని పరిశీలిస్తారు. జియో టాగింగ్ చేసి ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఎంపిక అనేది పూర్తిగా జియో టాగింగ్ ఆధారంగా జరుగుతుంది.
తర్వాత నిర్మాణ దశలవారిగా డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది.
అదేవిధంగా నిర్మాణ దశలవారీగా తనిఖీలు జరుగుతాయి. అధికారులు దశలవారీగా పనులను పరిశీలించడం జరుగుతుంది.
Official Website: https://pmayg.nic.in/
PMAY-G Apply Last Date?
PMAY-G కోసం డిసెంబర్ 14, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
PMAY-G కోసం ఎక్కడ అప్లై చేయాలి?
PMAY-G కోసం మీ గ్రామ వార్డు సచివాలయం లో అప్లై చేసుకోవాలి.
PMAY-G కింద ఎంత డబ్బులు జమ అవుతాయి?
PMAY-G కి అర్హత కలిగిన వారికి దశల వారీగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2,50,000 రూపాయలు జమ కావడం జరుగుతుంది.
PMAY-G కి ఎవరు అర్హులు?
సొంత స్థలం కలిగి, ఇల్లును నిర్మించుకోవడానికి స్తోమత లేనివారు ఈ PMAY-G కి అర్హులు.
Ok
Sure
Sir i have land 3 cents but i don’t have oun house help me to build house
Ajay Kumar
Ajay Kumar