AP Ratio Card new year 2026 wheat flour:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1, 2026వ తేదీ నుండి రేషన్ షాపుల్లో గోధుమ పిండిని అందజేయనున్నారు. ఈ AP Ratio Card new year 2026 wheat flour కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకనుండి తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి రేషన్ షాపుల్లో గోధుమ పిండిని కూడా ఇవ్వనున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1, 2026 వ తేదీ నుండి రేషన్ కార్డు కలిగిన వారికి కేజీ ₹20 చొప్పున రేషన్ షాపుల్లో గోధుమ పిండిని అందజేయనున్నారు. ఒక్కో కార్డుకు ఒక కేజీ చొప్పున ఇవ్వనున్నారు.
కేజి గోధుమ పిండి బయట కొంటే నాణ్యతను బట్టి 40 రూపాయల నుండి 80 రూపాయల మధ్య ధర పలుకుతుంది. ప్రభుత్వం 20 రూపాయలకే అందజేస్తున్నారు కాబట్టి పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు ఇది శుభవార్త.
పదవ తరగతి అర్హతతో 22000 సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు
ఏపీ ప్రభుత్వం గోధుమ పిండి నీ ఎలా సేకరిస్తుంది?
జాతీయ ఆహార భద్రతా పథకం (NFSA) కింద రాష్ట్ర ప్రభుత్వం గోధుమలను సేకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఈ గోధుమ లను పిండిగా మారుస్తుంది. పిండిగా మార్చిన తర్వాత ఒక కేజీ ప్యాకెట్ గా ప్యాక్ చేస్తారు.
ప్రభుత్వం నాణ్యత గల గోధుమ పిండిని అందజేయనుంది.
అర్హులు ఎవరు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు(BPL) కలిగిన అందరికి కార్డుకు కేజీ చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది. అయితే మొదటగా పట్టణాల్లో ఎక్కువగా పంపిణీ చేయనున్నట్లు సమాచారం.
| పదార్థం | గోధుమపిండి |
| రేటు | 20 రూపాయలు |
| మార్కెట్ రేటు | ₹40 – ₹80 |
| ఎవరు అర్హులు? | తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు |
| ప్రారంభ తేదీ | జనవరి 1, 2026 |
ఈ పథకం ద్వారా లాభమేనా?
బయట షాపుల్లో కేజీ గోధుమపిండి కొంటే 40 రూపాయల నుండి 80 రూపాయల వరకు తీసుకుంటున్నారు. ప్రభుత్వం కేవలం 20 రూపాయలకే నాణ్యత గల పిండిని అందజేయనుంది. కాబట్టి పేద, మధ్యతరగతి కుటుంబాలకు లాభమని భావించాలి.
రాబోయే రోజుల్లో రేషన్ షాపుల్లో జొన్నలు కూడా పంపిణీ చేయాలని నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఏపీ రేషన్ ద్వారా జనవరి 01, 2026 నుండి గోధుమపిండి అందజేస్తారా?
అవును జనవరి 01, 2026 వ తేదీ నుండి గోధుమపిండిని అందజేస్తారు.
ఏపీ రేషన్ షాపులో గోధుమ పిండి ధర?
కిలో 20 రూపాయలు
ఏపీ రేషన్ షాపులో గోధుమపిండి కి ఎవరు అర్హులు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు గోధుమ పిండి కి అర్హులు.
ఏపీ లో ఒక రేషన్ కార్డు కి ఎన్ని కిలోలు గోధుమ పిండి వస్తుంది?
ఒక రేషన్ కార్డు కి ఒక కిలో గోధుమపిండిని ప్రభుత్వం అందజేస్తుంది.
Great Manohar sir….alage RSK ppc staff ki vudyoga badratha kalipinchandi sir
సార్ rice వెహికల్స్ క్లియర్న్స్ ఇవ్వండి
Not implemented this is One of the frak