ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త. రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళలు అప్లై చేసుకునే విధంగా 1095 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల అయింది. చాలా పోస్టులకి ఎటువంటి క్వాలిఫికేషన్ కూడా అడగలేదు. ఈ AP KGBVs Notification 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర శిక్ష, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా type -III KGBVs (కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు) మరియు type -IV KGBVs(కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు) లో 1095 నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ పోస్టులకి మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి.
AP KGBVs Notification 2026:
ఈ AP KGBVs Notification 2026 ద్వారా
type -III KGBVs లో 564 పోస్టులను
type -IV KGBVs లో 531 పోస్టులను
మొత్తంగా 1095 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
type -III KGBVs లో
| పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
| ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్ | 77 |
| కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ | 134 |
| ANM | 110 |
| అకౌంటెంట్ | 11 |
| అటెండర్ | 28 |
| హెడ్ కుక్ | 22 |
| అసిస్టెంట్ కుక్ | 89 |
| డే వాచ్ విమెన్ | 18 |
| నైట్ వాచ్ విమెన్ | 26 |
| స్కావెంజర్ | 33 |
| స్వీపర్ | 16 |
| మొత్తం | 564 |
type -IV KGBVs లో
| పోస్ట్ పేరు | ఖాళీల సంఖ్య |
| వార్డెన్ | 86 |
| పార్ట్ టైం టీచర్ | 122 |
| చౌకీదారు | 77 |
| హెడ్ కుక్ | 76 |
| అసిస్టెంట్ కుక్ | 170 |
| మొత్తం | 531 |
పదవ తరగతి అర్హతతో 22000 సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు
Age Limit:
జూలై 1, 2025 వ తేదీ నాటికి 18 సంవత్సరముల నుండి 45 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ AP KGBVs Notification 2026 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టి, బీసీ మరియు ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 52 సంవత్సరముల వరకు అప్లై చేసుకోవచ్చు.
Educational Qualification:
హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్, డే/నైట్ వాచ్ వుమెన్, చౌకీదారు మరియు అటెండర్ పోస్టులకి ఎటువంటి క్వాలిఫికేషన్ అడగలేదు. పెద్దగా చదువుకోని వారు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్: ఇంటర్ పాసై PGDCM చేసి ఉండాలి. లేదా కంప్యూటర్ డిసిప్లేన్ లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి.(బీకాం కంప్యూటర్స్ లేదా బీఎస్సీ కంప్యూటర్స్ లేదా ఈక్వాలెంట్)
ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్: పదవ తరగతి పాస్ అయి ఉండాలి. మ్యూజిక్ లేదా డాన్స్ లో డిప్లమా/సర్టిఫికెట్ ఉండాలి. లేదా
ఐటిఐ లేదా డి ఎల్ టి సి లో sewing, Tailoring, Weaving, etc., ట్రేడ్స్ లో సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి.
అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ నుండి టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ను కలిగి ఉండాలి.
అకౌంటెంట్: బీకాం/బీకాం (కంప్యూటర్) చేసినవారు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు.
వార్డెన్: 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే 50% మార్కులతో B.Ed.,/M.A కంప్లీట్ చేసి ఉండాలి.
పార్ట్ టైం టీచర్స్: 50% మార్కులతో బిఎస్సి మ్యాథ్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే 50% మార్కులతో B.Ed.,/M.A పాసై ఉండాలి.
ANM(Auxiliary Nurse Midwife): Inter and MPHW Course (2Years) చేసి ఉండాలి. లేదా
Female Intermediate Pass with ANM ట్రైనింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
How To Apply:
ఈ AP KGBVs Notification 2026 ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. జనవరి 3, 2026వ తేదీ నుండి జనవరి 11, 2026 వ తేదీ మధ్య ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.
జనవరి 2, 2026వ తేదీన ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్ లో పేపర్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది.
అభ్యర్థులు అప్లికేషన్ ఫారం ను తీసుకొని పూర్తిగా ఎటువంటి తప్పులు లేకుండా నింపాలి. ఏవైనా డాక్యుమెంట్స్ అడిగితే అప్లికేషన్ ఫారం కి అటాచ్ చేయాలి. అన్ని తీసుకొని అభ్యర్థులు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీసు వద్దకు వెళ్లి జనవరి 11, 2026వ తేదీలోగా అందజేయాలి.
Selection Process:
Walk-in -Interviews ద్వారా ఈ AP KGBVs Notification 2026 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ ను నిర్వహించడం జరగదు.
జనవరి 11, 2026 వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకుంటే, జనవరి 12, 2026వ తేదీ నుండి మండలం వైస్ ప్రొవిజినల్ సెలక్షన్ లిస్టును తీయడం జరుగుతుంది.
ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్ ను జనవరి 19, 2026 వ తేదీన డిస్ప్లే చేయడం జరుగుతుంది.
జనవరి 23, 2026వ తేదీ నుండి జనవరి 24, 2026 వ తేదీ మధ్య అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది.
సెలెక్ట్ అయినా అభ్యర్థులను ఫిబ్రవరి 1, 2026వ తేదీన డ్యూటీకి రమ్మని పిలవడం జరుగుతుంది.
అయితే అభ్యర్థులకు ముందుగా స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మండలంలో స్థానికులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.
జిల్లాల వారీగా ఖాళీలు
| జిల్లా పేరు | Type III | Type IV |
| శ్రీకాకుళం | 30 | 27 |
| మన్యం | 16 | 18 |
| విజయనగరం | 36 | 27 |
| విశాఖపట్నం | 6 | 14 |
| ASR | 39 | 67 |
| అనకాపల్లి | 20 | 63 |
| కాకినాడ | 6 | 7 |
| ఏలూరు | 2 | 0 |
| ఎన్టీఆర్ | 4 | 1 |
| పల్నాడు | 62 | 38 |
| ప్రకాశం | 44 | 61 |
| బాపట్ల | 4 | 0 |
| ఎస్పీఎస్ఆర్ నెల్లూరు | 26 | 26 |
| చిత్తూరు | 19 | 10 |
| తిరుపతి | 9 | 23 |
| వైఎస్ఆర్ కడప | 27 | 3 |
| అన్నమయ్య | 56 | 36 |
| అనంతపురం | 40 | 20 |
| శ్రీ సత్య సాయి | 21 | 47 |
| నంద్యాల | 41 | 21 |
| కర్నూలు | 56 | 22 |
| మొత్తం | 564 | 531 |
మొత్తంగా 1095 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. జిల్లా వైజ్ గా ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయో మీరే అఫీషియల్ నోటిఫికేషన్ లోకి వెళ్లి చూసుకోండి.
Application Fee:
ఈ AP KGBVs Notification 2026 కి సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Official Website: https://apkgbv.apcfss.in/
Kurnool kalluru kurnool sukulamma temple road kurnool ayyapa swami nagar kalluru kurnool h no 77_140-8
-23c
Attender
Computer inspector
Cook ing
Bc
Mukkamalli Parveen, Yeraguntla, P
rakash Nagar 1-184, kadapa (D),
10th class