AP Sankranti Special 2026: గ్రామాల్లో అన్నా క్యాంటీన్లు

AP Sankranti Special 2026:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలోని మండల మరియు గ్రామీణ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లను ప్రారంభించనుంది. ఈ AP Sankranti Special 2026 anna canteen కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

“అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది” అని పెద్దలు అంటారు. ఈ అన్నా క్యాంటీన్ పథకం రాష్ట్రంలో ప్రతిరోజు లక్షల మంది పేద ప్రజల కడుపు నింపుతోంది. అన్నా క్యాంటీన్ పథకాన్ని పున ప్రారంభించి కూటమి ప్రభుత్వం హిట్టు కొట్టిందని చెప్పాలి.

రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త: ఇకనుండి గోధుమ పిండి కూడా

అన్నా క్యాంటీన్ల ప్రత్యేకత ఏమిటి అంటే 5 రూపాయలు ఉంటే టిఫిన్, భోజనం చేయవచ్చు. అదే భోజనం బయట తింటే అటు ఇటుగా 100 రూపాయలు అవుతుంది. పేద ప్రజలు నిజంగా ఈ పథకాన్ని వరం గా భావించాలి. అయితే అన్నా క్యాంటీన్ ను ఇన్ని రోజులు పట్టణాలకే పరిమితమయ్యాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 205 అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. ఈ 205 అన్నా క్యాంటీన్లలో ప్రతిరోజు 2 లక్షలకు పైగా పేద ప్రజలు ఆకలి తీర్చుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లలో టిఫిన్/భోజనం ఏదైనా ప్లేటు 5 రూపాయలకు అందిస్తారు.

అయితే పట్టణాలకే పరిమితమైన అన్నా క్యాంటీన్ల ను ఇకనుండి గ్రామాల్లో కూడా ప్రారంభించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలోని మండల మరియు గ్రామీణ ప్రాంతాల్లో 70 అన్నా క్యాంటీన్లను నూతనంగా ప్రారంభించనుంది. ఈ 70 అన్న క్యాంటీన్లను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13, 2026వ తేదీ నుండి జనవరి 15, 2026వ తేదీల్లో మూడు రోజులలో ప్రారంభించనున్నారు.

రాష్ట్రంఆంధ్రప్రదేశ్
పథకంఅన్నా క్యాంటీన్
ప్లేటు(టిఫిన్/భోజనం)5 రూపాయలు
నూతనంగా అన్నా క్యాంటీన్లు70
ఎప్పుడు ప్రారంభిస్తారుసంక్రాంతి సందర్భంగా

రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా 70 అన్న క్యాంటీన్లు అంటే తక్కువనే అనుకోవచ్చు. అయితే రానున్న రోజుల్లో ప్రభుత్వం వీటి సంఖ్యను పెంచుకుంటూ పోతుంది.

2026 సంక్రాంతి సందర్భంగా నూతనంగా అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారా?

అవును, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా నూతనంగా 70 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సందర్భంగా ఎన్ని అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారు?

2026 సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 70 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనుంది.

గ్రామాల్లో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తారా?

అవును, ఆంధ్రప్రదేశ్ లోని మండల మరియు గ్రామీణ ప్రాంతాల్లో 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా 70 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారు.

అన్నా క్యాంటీన్లలో ప్లేటు (టిఫిన్/భోజనం రూ. ఎంత?

అన్నా క్యాంటీన్లలో ప్లేటు(టిఫిన్/భోజనం) 5 రూపాయలు.

Leave a Comment