AP New Districts:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాలను 28 జిల్లాలుగా మార్చింది. 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అలాగే ఒక జిల్లా కేంద్రాన్ని కూడా మార్చడం జరిగింది. అలాగే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు. కొన్ని మండలాల సరిహద్దులను కూడా మార్చడం జరిగింది. ఈ AP New Districts కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకనుండి 28 జిల్లాలు. కొత్తగా రెండు జిల్లాలు ఏర్పడ్డాయి. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను డిసెంబర్ 30, 2025వ తేదీ మంగళవారం జారీ చేసింది.
పదవ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు
డిసెంబర్ 31, 2025 వ తేదీ బుధవారం నుండి జిల్లా కేంద్రాల నుండి పాలన మొదలైంది. 26 జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం 28 జిల్లాలుగా మార్చింది.
రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్ల కేంద్రంగా కొనసాగుతున్న రాయచోటిని మదనపల్లికి మార్చడం జరిగింది. అలాగే నూతనంగా రాష్ట్రంలో 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసింది. పలు మండలాల సరిహద్దులు కూడా మార్పులు చేయడం జరిగింది. స్థానికుల కోరిక మేరకు మార్పులు చేయడం జరిగింది.
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| గతంలో జిల్లాల సంఖ్య | 26 |
| ప్రస్తుతం జిల్లాల సంఖ్య | 28 |
| కొత్తగా ఏర్పడిన జిల్లాలు | 2 |
| కొత్త జిల్లాల పేర్లు | పోలవరం, మార్కాపురం |
నూతనంగా 5 రెవెన్యూ డివిజన్లు:
- అనకాపల్లి జిల్లాలోని అడ్డరోడ్డు జంక్షన్
- ప్రకాశం జిల్లాలోని అద్దంకి
- అన్నమయ్య జిల్లాలోని పీలేరు
- శ్రీ సత్య సాయి జిల్లాలోని మడకశిర
- నంద్యాల జిల్లాలోని బనగానపల్లి
అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలోకి మార్చడం జరిగింది. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట ను వైయస్సార్ కడప జిల్లాకు మార్చడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేటను తూర్పుగోదావరి జిల్లాలో కలిపారు. అలాగే అద్దంకి, దర్శి నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలోకి చేర్చడం జరిగింది.
అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని తొలగించి మదనపల్లి కి మార్చడం జరిగింది.
అలాగే పలు మండలాల సరి హద్దులను కూడా మార్చారు. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో మార్పులు చేసినట్లు మంత్రి అనగానీ సత్యప్రసాద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య ఎన్ని?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 28.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేర్చిన కొత్త జిల్లాల సంఖ్య?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేర్చిన కొత్త జిల్లాల సంఖ్య 2
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాల పేర్లు?
పోలవరం, మార్కాపురం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజన్లు ఎన్ని?
5 రెవెన్యూ డివిజన్లు
Why kaikaluru constituency not changed to Krishna district
Machilipatnam…. Head 40 km and above
Eluru– head -25 km
Ayya zillala thopatu,zillalalo Pani chestunna homeguards jeethalu penchi Anni sadipayalu kalpinchandi
Why not changed Nuzvidu constituency from Eluru district to Ntr district
Tekkali is the oldest revenue division in Srikakulam district. A new district has been created in all the old districts but Srikakulam is untouched. Tekkali district should be formed with Tekkali, Narasannapeta, Pathapatnam, Palasa and Ichapuram constituencies.