Bank Holidays 2026 in telugu: ఏపీ, టీజీ బ్యాంక్ సెలవుల జాబితా

Bank Holidays 2026 in telugu

నూతన సంవత్సరం 2026 మొదలయ్యింది. మునుపటి ఆర్థికపరమైన తప్పులను ఇక మానండి. ఇకనుండి అయినా ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన విషయాలు అంటే అందరికీ గుర్తొచ్చేది బ్యాంకులు. దాదాపు అందరికీ తమ బ్యాంకు అకౌంటుతో పని ఉంటుంది. సంవత్సరంలో ఒక్కసారైనా బ్యాంకు దగ్గరకు వెళ్లి రావాల్సి పని పడవచ్చు. అందుకే బ్యాంకుల్లో 2026 సంవత్సరానికి సంబంధించి సెలవులు ఎప్పుడూ ఉన్నాయో తెలుసుకోండి. ఈ Bank Holidays 2026 in telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

బ్యాంకుల్లో ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ బ్యాంకులు ఏరోజు నిర్వహించబడతాయి, సెలవులు ఎప్పుడూ ఉన్నాయి అనేది కచ్చితంగా తెలుసుకోవాలి. తాజాగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నూతన సంవత్సరం 2026 కి సంబంధించి బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేసింది.

ప్రతి సంవత్సరం లాగే 2026 లో కూడా బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా జరుపుకునే హోలీ, దసరా, దీపావళి పండుగల సందర్భంగ మరియు గణతంత్ర దినోత్సవం, స్వాతంత్రపు దినోత్సవం, గాంధీ జయంతి వంటి ముఖ్యమైన రోజులలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు.

పదవ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు.

అలాగే బ్యాంకులకు రెండవ శనివారం, నాలుగవ శనివారం మరియు ఆదివారాలు సాధారణ సెలవులు.

అయితే ప్రాంతం ఆధారంగా జరుపుకునే పండల (ప్రాంతీయ పండగలు) సెలవులు రాష్ట్ర, రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని బ్యాంకులకు 2026 సంవత్సరానికి సంబంధించి సెలవుల జాబితాను చూద్దాం. ప్రత్యేకంగా కేటాయించిన సెలవులు. అయితే ప్రతినెల రెండవ శనివారం, నాలుగవ శనివారం మరియు ఆదివారాలు సాధారణంగా సెలవులు ఉంటాయి.

నెలసెలవుల తేదీలు
జనవరిమకర సంక్రాంతి(జనవరి 15, 2026), గణతంత్ర దినోత్సవం (జనవరి 26, 2026)
ఫిబ్రవరిప్రత్యేకంగా సెలవులు లేవు
మార్చిహోలీ(మార్చి 3, 2026), ఉగాది (మార్చి 19, 2026), రంజాన్ (ఆంధ్రప్రదేశ్లో మార్చి 20, తెలంగాణలో మార్చి 21), శ్రీరామనవమి (మార్చి 27, 2026)
ఏప్రిల్అకౌంట్స్ క్లోజింగ్ డే(ఏప్రిల్ 1, 2026), గుడ్ ఫ్రైడే (ఏప్రిల్ 3, 2026), డా. బిఆర్ అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14, 2026)
మేమే డే(మే 1, 2026), బక్రీద్ (మే 27, 2026)
జూన్మొహరం (ఆంధ్రప్రదేశ్లో జూన్ 25, తెలంగాణలో జూన్ 26)
జులైప్రత్యేక సెలవులు లేవు
ఆగస్టుస్వాతంత్ర్య దినోత్సవం(ఆగస్టు 15, 2026), మిలాద్ ఉన్ నబీ (ఏపీలో ఆగస్టు 25, తెలంగాణలో ఆగస్టు 26)
సెప్టెంబర్శ్రీకృష్ణ జన్మాష్టమి(సెప్టెంబర్ 4, 2026), వినాయక చవితి (సెప్టెంబర్ 14, 2026)
అక్టోబర్గాంధీ జయంతి(అక్టోబర్ 2, 2026), విజయదశమి (అక్టోబర్ 20, 2026)
నవంబర్గురునానక్ జయంతి(నవంబర్ 24, 2026, అయితే ఈరోజు ఏపీలో సెలవు లేదు), దీపావళి 8 వ తేదీ ఆదివారం వచ్చింది.
డిసెంబర్క్రిస్మస్(డిసెంబర్ 25, 2026)

Leave a Comment