PM Kissan 22nd Payment In Telugu
రైతులకు శుభవార్త. దేశంలోని రైతులకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. PM Kissan పథకం కింద 22వ సారి 2000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో వేయనుంది. రైతులకి ఈ డబ్బులు రావాలి అంటే ఈకేవైసీ ని పూర్తి చేసి ఉండాలి. ఈ PM Kissan 22nd Payment In Telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
PM Kissan (ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన) పథకం కింద కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6000 రూపాయలను వేస్తూ వస్తోంది.
ఈ PM Kissan పథకం కింద సంవత్సరానికి ఒకటే సారి 6000 కాకుండా, మూడు విడతల్లో విడతకు 2000 చొప్పున వేస్తూ వస్తోంది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 21 సార్లు రైతుల అకౌంట్లో 2,000 వేల రూపాయలను జమ చేయడం జరిగింది. అయితే 22వ సారి కూడా కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలను జమా చేయనుంది.
Annadata Sukhibhava 3rd Payment
22 వ ఇన్స్టాల్మెంట్ లో కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలను ఫిబ్రవరి నెలలో వేయనుంది. అయితే రైతులు Ekyc పూర్తి చేస్తేనే తమ అకౌంట్లో ఈ ₹2000 జమవుతుంది.
PM Kissan Ekyc ఎలా చేయాలి?

పిఎం కిసాన్ పథకం కింద మీ అకౌంట్ లో డబ్బులు పడాలి అంటే కచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. సులభంగా మీ మొబైల్ లోనే ఈ విధంగా ఈకేవైసీ నీ కంప్లీట్ చేసుకోండి.
రైతులు pmkisan.gov.in వెబ్ సైట్ లోకి వెళ్ళాలి. అక్కడ Farmers Corne లోకి వెళ్లి Ekyc పై క్లిక్ చేయండి. తర్వాత ఆధార్ నెంబర్ మరియు క్యాప్చ ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి.
ఆధార్ కార్డుకు లింక్ అయినా మొబైల్ నెంబర్ కు ఓటిపి రావడం జరుగుతుంది. ఓటిపి ని ఎంటర్ చేయండి. ఓటిపి నీ ఎంటర్ చేస్తే రైతు యొక్క ఈకేవైసీ కంప్లీట్ అవుతుంది.
ఈ విధంగా రైతులు కచ్చితంగా తమ ఈకేవైసీ ని కంప్లీట్ చేసుకోండి.
అయితే ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రంలో రైతుల అకౌంట్లో పీఎం కిసాన్ పథకం కింద ₹2,000 మరియు అన్నదాత సుఖీభవ పథకం కింద 4000 రూపాయలు మొత్తంగా 6000 ఫిబ్రవరి నెలలో జమా కానున్నాయి.
Official Website: https://pmkisan.gov.in/
ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ పథకాల వివరాలు మరియు జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
PM Kissan పథకం కింద 22 వ విడత డబ్బులు ఎప్పుడు వేస్తారు?
PM Kissan పథకం కింద 22వ విడత కింద 2,000 రూపాయలను ఫిబ్రవరి నెలలో వేయనున్నారు.
PM Kissan పథకం కింద సంవత్సరానికి ఎన్ని డబ్బులు వేస్తారు?
PM Kissan పథకం కింద సంవత్సరానికి 6,000 రూపాయలను వేయడం జరుగుతుంది.
PM Kissan పథకం కింద సంవత్సరానికి ఎన్ని విడుతల్లో డబ్బులు వేయడం జరుగుతుంది.
PM Kissan పథకం కింద సంవత్సరానికి 3 విడుతల్లో రైతుల అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది.
ఒక్కో విడతకు PM Kissan పథకం కింద ఎన్ని డబ్బులు రైతుల అకౌంట్లో పడతాయి?
PM Kissan పథకం కింద ఒక విడతకు ₹2,000 ను రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది.