AP Veterinary camps 2026: ఉచిత పశు వైద్య శిబిరాలు

AP Veterinary camps 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశువులను కలిగిన రైతులకు కుశుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనుంది. ఈ AP Veterinary camps 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 25 లక్షల కుటుంబాలు పశు పోషణపై ఆధారపడి జీవిస్తున్నాయి. పశువులను వ్యాధుల నుండి కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం శిబిరాలను ఏర్పాటు చేయనుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశు సంపదను కాపాడుకోవడమే లక్ష్యంగా జనవరి 19, 2026వ తేదీ నుండి జనవరి 31 2026 వ తేదీ మధ్య ఉచితంగా పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనుంది. ఈ తేదీల మధ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తుంది.

ఏపీ సచివాలయం ల పేర్లు మార్పు

ఈ వైద్య శిబిరాల్లో పశువులకు ఉచితంగా టీకాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, పశు వైద్య చికిత్సలు, గర్భకోశ వ్యాధుల చికిత్స, నట్టాలనివారణ మందుల పంపిణీ చేయనున్నారు. అలాగే పశువుల వ్యాధుల నివారణ, పశుపోషణ పై అవగాహన కల్పించనున్నారు.

2025వ సంవత్సరంలో 13,257 గ్రామాల్లో నిర్వహించిన పశు వైద్య శిబిరాల ద్వారా 10.48 లక్షల పశువులకు వైద్యం అందింది. సుమారుగా 5.36 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరింది.

ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ పథకాల వివరాలు మరియు జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

WhatsApp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment