AP Govt Ramadan: వీరికి శుభవార్త.. రంజాన్ మాసం ప్రారంభం

రంజాన్ మాసం మొదలైంది. ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ఫిబ్రవరి 19, 2026 వ తేదీ నుండి మొదలైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు శుభవార్త తెలిపింది.

సౌదీలో రంజాన్ మాసం ఫిబ్రవరి 18, 2026వ తేదీ ప్రారంభం అవ్వగా ఇండియాలో ఫిబ్రవరి 19, 2026వ తేదీ నుండి రంజాన్ మాసం మొదలైంది.

ఈ మాసంలో ముస్లిం సహోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో మెలుగుతారు. ప్రతిరోజు ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలు నిర్వహిస్తారు. దానధర్మాల కార్యక్రమాలను ఈ మాసంలో అధికంగా నిర్వహిస్తారు.

AP Govt: మహిళలకు శుభవార్త

ఈ రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ముస్లిం ఉద్యోగులు సాయంకాలం ఒక గంట ముందుగానే ఇంటికి వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులు బాటు కల్పించింది. ఈ రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులు తమ పని వేళల్లో సాయంకాలం ఒక గంట ముందుగానే ఇంటికి వెళ్లొచ్చు.

ఫిబ్రవరి 18, 2026వ తేదీ నుండి మార్చి 19, 2026వ తేదీ వరకు ప్రభుత్వం ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించింది.

ఇటువంటి లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram ChannelClick Here

Leave a Comment