ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి విద్యార్థులకు బిగ్ అప్డేట్. చాలా రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి టైం టేబుల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రభుత్వం పదవ తరగతి టైం టేబుల్ లో కొన్ని మార్పులు చేసింది. ఈ AP 10th Time Table Date Extended 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే 10వ తరగతి పబ్లిక్ పరీక్షాల టైం టేబుల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. పదవ తరగతి పరీక్షలను మార్చి 16, 2026వ తేదీ నుండి ఏప్రిల్ 01, 2026వ తేదీల మధ్య నిర్వహించనున్నారు.
అయితే రంజాన్ పండుగ మార్చి 20, 2026వ తేదీన ఉండడంతో, అదే తేదీన ఉన్న ఇంగ్లీష్ పరీక్షను మార్చడం జరిగింది.
మార్చి 20, 2026వ తేదీన నిర్వహించాల్సిన ఇంగ్లీష్ పరీక్షను మార్చి 21, 2026 కు వాయిదా వేస్తూ కొత్త టైం టేబుల్ ను ప్రభుత్వం ప్రకటించింది.
ఇంగ్లీష్ పరీక్ష తప్పా మిగిలిన ఏ పరీక్ష తేదీలను మార్చలేదు. మిగిలిన అన్ని పరీక్షలు యధావిధిగా పాత టైం టేబుల్ ప్రకారం నిర్వహించడం జరుగుతుంది.
ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ వివరాలు మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
1 thought on “రంజాన్ ఎఫెక్ట్.. మారిన 10వ తరగతి టైం టేబుల్”