విద్యార్థులకు గుడ్ న్యూస్! ఒంటిపూట బడులు AP Summer Half Days 2026

AP Summer Half Days 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్కూలు విద్యార్థులకు శుభవార్త తెలిపింది. రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒంటిపూట బడులను నిర్వహించనుంది. ఈ AP Summer Half Days 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎండ తీవ్రతలను బట్టి ఒంటిపూట బడులు, వేసవి సెలవులు ఇస్తూ వస్తోంది.

ఈ సంవత్సరం కూడా ఎండల తీవ్రత పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒంటిపూట బడి తేదీలను ప్రకటించింది. రాష్ట్రంలో ఒంటిపూట బడులు మార్చి 16, 2026వ తేదీ నుండి ప్రారంభం అవ్వనున్నాయి.

ఈ ఒంటిపూట బడిలో విద్యార్థులకు పాఠశాల ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30కు ముగుస్తుంది.

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టి ఇంటికి పంపడం జరుగుతుంది.

అయితే 10వ తరగతి పరీక్షలు రాసే పాఠశాల కేంద్రాల్లో విద్యార్థులకు మధ్యాహ్నము 1 నుండి సాయంత్రం 5 వరకు పాఠశాలలు ఉంటాయి.

ఈ 10వ తరగతి పరీక్షలు మార్చి 16, 2026వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 01, 2026వ తేదీన ముగుస్తాయి.

10వ తరగతి పరీక్షల టైం టేబుల్ 2026

అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా మార్చి 16, 2026వ తేదీ నుండి వంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి.

ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ వివరాలు మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

2 thoughts on “విద్యార్థులకు గుడ్ న్యూస్! ఒంటిపూట బడులు AP Summer Half Days 2026”

Leave a Comment