AP Inter Exams 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 23, 2026వ తేదీ నుండి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అవనున్నాయి. పరీక్ష రాసే విద్యార్థులు ఈ తప్పులను అసలు చేయకండి. ఈ AP Inter Exams 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 23, 2026వ తేదీ సోమవారం నుండి, రెండవ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 24, 2026వ తేదీ మంగళవారం నుండి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 1537 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10,57,312 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
రంజాన్ ఎఫెక్ట్.. మారిన 10వ తరగతి టైం టేబుల్
ఇంటర్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తాయి.
• ఒక గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోండి.
8:30 గంటల నుండి విద్యార్థులను పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతిస్తారు.
• మొబైల్, స్మార్ట్ వాచెస్, క్యాలిక్యులేటర్లు పరీక్ష కేంద్రానికి అనుమతి లేదు.
• ప్రభుత్వం ప్రతి గదిలో సీసీటీవీ నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది.
• విద్యార్థుల కోసం అదనంగా బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది.
• టోల్ ఫ్రీ హెల్ప్ లైన్: 1800 425 1531
Note: ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రం లోపలికి అనుమతి చేయరు.
ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ వివరాలు మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |