AP Koushalam Skill Test: Date and Timings
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయాల్లో AP Koushalam Skill Test ను నిర్వహిస్తున్నారు. ఎవరైతే AP Koushalam కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ అభ్యర్థులకు డిసెంబర్ 02, 2025 వ తేదీ నుండి డిసెంబర్ 6, 2025 వ తేదీల మధ్య Skill Test ను నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని, ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడి “కౌశలం” అనే పేరుతో నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చనుంది.
దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఇంట్రెస్ట్ ఉన్న నిరుద్యోగులకు ఈ కౌశలంకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు తమ పరిధిలోని సచివాలయాల్లో ల తమ మొబైల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు వారు కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సచివాలయం వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోండి.
Eligibility:
Educational Qualification: పదవ తరగతికి తక్కువ, పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లమా, గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ డప్లమా, పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ AP Koushalam Survey కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
Age Limit: 18 సంవత్సరముల నుండి 50 సంవత్సరముల మధ్య వయసు కలిగిన నిరుద్యోగులు అందరూ ఈ AP Koushalam Survey కి అప్లై చేసుకోవచ్చు.
ఎవరైతే AP Koushalam కు అప్లై చేసుకున్నారో వారికి ఇప్పుడు సచివాలయాల్లో డిసెంబర్ 02, 2025 వ తేదీ నుండి డిసెంబర్ 06, 2025 వ తేదీ మధ్య AP Koushalam Skill Test ను నిర్వహించనున్నారు.
AP Koushalam Skill Test Timings:
ఈ AP Koushalam Skill Test ను సచివాలయంలో డిసెంబర్ 2, 2025వ తేదీ నుండి డిసెంబర్ 6, 2025 వ తేదీ మధ్య ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒకరికి, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ఒకరికి మొత్తంగా సచివాలయం పరిధిలో ఇద్దరికీ మాత్రమే రోజుకు ఈ AP Koushalam Skill Test ను నిర్వహించడం జరుగుతుంది.
ఎవరికైతే AP Koushalam Skill Test ఉంటుందో వారికి ముందుగానే SMS మరియు మెయిల్ ద్వారా మెసేజ్ రావడం జరుగుతుంది.
AP Koushalam Skill Test Pattern:
ఈ AP Koushalam Skill Test అనేది మార్నింగ్ సెషన్ అయితే ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్ అయితే మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ఉంటుంది.
అంటే ఈ AP Koushalam Skill Test అనేది 1 గంటసేపు ఉంటుంది. సమాచారం మేరకు ఈ 1 గంట సమయంలో 45 నిమిషాలు మ్యాథమెటిక్స్ కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. మిగిలిన 15 నిమిషాలు కమ్యూనికేషన్ స్కిల్స్ కి సంబంధించి ఉంటుంది.
అయితే సమాచారం మేరకు ప్రస్తుతం డిసెంబర్ 2, 2025 వ తేదీ నుండి డిసెంబర్ 6, 2025 వ తేదీల మధ్య ఒక్కో సచివాలయంలో రోజుకు ఇద్దరు చొప్పున ఈ 5 రోజులలో 10 మందికి మాత్రమే AP Koushalam Skill Test ను నిర్వహించనున్నారు. అయితే మిగిలిన వారికి ఎప్పుడు నిర్వహిస్తారో తెలియాల్సి ఉంది.
Naku message raledhu wait chayalaa???
Naku koushal skill test nundi em message raledhu eppudu em cheyalli
Naku sms raledu
Naku sms raledu sir
Naku sms em raleduuu Ela sir
Message raledhu sir epudu vasthundhi reply me
Message raledhu epudu vasthundhi