Download AP TET Hall Ticket 2025 In Telugu: ఏపీ టెట్ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ నుండి AP TET Hall Ticket 2025 లు విడుదల అయ్యాయి. ఈ AP tet hall ticket 2025 ను ఏ విధంగా Download చేసుకోవాలో చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) పరీక్షలు డిసెంబర్ 10, 2025 వ తేదీ నుండి జరగనున్నాయి. రోజుకు రెండు షిఫ్టు ల వారీగా ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఉంటుంది. రెండవ షిఫ్టు మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
ఈ AP tet (ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) కోసం 2,71,692 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తు చేసుకున్న 2,71,692 మంది అభ్యర్థులకు AP tet Exams 2025 ను డిసెంబర్ 10, 2025వ తేదీ నుండి నిర్వహించనున్నారు. అయితే ఈ 2,71,692 మంది అభ్యర్థులకు AP TET Hall Ticket 2025 ను డిసెంబర్ మూడవ తేదీ విడుదల చేస్తామని తెలిపారు.

పదవ తరగతి అర్హతతో SSC లో 25,487 కానిస్టేబుల్ జిడి ఉద్యోగాలు.

AP TET Hall Ticket 2025 హాల్ టికెట్లను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం.

Download AP TET Hall Ticket 2025:

ముందుగా అభ్యర్థులు AP TET అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి https://tet2dsc.apcfss.in/ లోకి వెళ్ళండి.

తరువాత అక్కడ రైట్ సైడ్ లో టాప్ లో త్రీ లైన్స్ పై క్లిక్ చేయండి.

మీరు క్లిక్ చేయగానే డిపార్ట్మెంట్ లాగిన్, క్యాండిడేట్ లాగిన్ అని ఆప్షన్స్ కనబడతాయి.
అక్కడ క్యాండిడేట్ లాగిన్ పై క్లిక్ చేయండి.
తర్వాత మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చ ఎంటర్ చేసి సైన్ ఇన్ పై క్లిక్ చేయండి.
మీరు వెబ్సైట్లోకి సైన్ ఇన్ అవడం జరుగుతుంది. తర్వాత డాష్ బోర్డులో సర్వీసెస్ పై క్లిక్ చేయండి.
సర్వీసెస్ పై క్లిక్ చేయగానే మీ టెట్ హాల్ టికెట్ను ప్రింట్ తీసుకోండి అనే ఆప్షన్ కనపడుతుంది. దానిపై క్లిక్ చేసి మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.

Official Website: https://tet2dsc.apcfss.in/

Leave a Comment