Telangana 10th Supplementary Examination Fee 2026
తెలంగాణ పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లమెంటరీని నిర్వహించడం జరుగుతుంది. ఈ Telangana 10th Supplementary Examination Fee 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు విడుదల కావడం జరిగింది. పరీక్షా ఫలితాలలో 95.15% మంది విద్యార్థులు పాస్ కావడం జరిగింది. బాలురు 94.07% మంది పాస్ కాగా, బాలికలు 96.26% మంది పాస్ కావడం జరిగింది.
ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లమెంటరీ పరీక్షలను జూన్ 5, 2026 వ తేదీ నుండి జూన్ 12, 2026 వ తేదీ మధ్య నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష ఉంటుంది. ఈ సప్లమెంటరీ పరీక్షల కోసం విద్యార్థులు ఏప్రిల్ 30, 2026వ తేదీ నుండి స్కూల్ లలో అప్లై చేసుకోవాలి.
రికౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ పెట్టాలనుకునే అభ్యర్థులు ఏప్రిల్ 30, 2026వ తేదీ నుండి మే 14, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి. రీకౌంటింగ్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు సబ్జెక్టుకు 500 రూపాయలను చెల్లించాలి. రీ వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు సబ్జెక్టుకు ₹1000 చెల్లించాలి.
విద్యార్థులు పాఠశాల వద్దకు వెళ్లి అప్లై చేసుకోండి.
ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మరియు జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |