ఎంసెట్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి! AP EAPCET Results 2026

AP EAPCET Results 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఎంసెట్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పరీక్షా ఫలితాలు జూలై 1, 2026వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అయ్యాయి. ఈ AP EAPCET Results 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ EAMCET పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి నెలలో విడుదల కావడం జరిగింది. ఫిబ్రవరి 4 వ తేదీ నుండి మార్చి 24 వ తేదీల మధ్య అభ్యర్థులు అప్లై చేసుకున్నారూ.

ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలు మే 12, 13, 14, 15, 18 తేదీల్లో నిర్వహించడం జరిగింది. అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగానికి సంబంధించిన పరీక్షలను మే 19, 20 వ తేదీల్లో నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలను మొత్తంగా 3.55 లక్షల మంది విద్యార్థులు రాయడం జరిగింది.

ఏఐ ప్రభావం.. కాలేజీల్లో 12వేల కోర్సులు ఎత్తివేత.

అయితే ఏపీ ఎంసెట్ పరీక్ష ఫలితాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. దీనికి గల కారణం రెండవ సంవత్సరం విద్యార్థులకు బెటర్మెంట్ అవకాశం కల్పించడం. ఈ సంవత్సరం నూతనంగా రెండవ సంవత్సరం విద్యార్థులకు బెటర్మెంట్ అవకాశాన్ని కల్పించారు. ఇందుమూలంగా ఎంత సేపు పరీక్ష ఫలితాలు వాయిదా పడడం జరిగింది.

ఎందుకంటే ఎంసెట్ ఫలితాల్లో 25% వెయిటేజీని ఇంటర్ మార్కులకు ఇవ్వడం జరుగుతుంది.

అయితే ఎట్టకేలకు ఎంసెట్ పరీక్ష ఫలితాలు జులై 1, 2026వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. విద్యార్థులు క్రింది విధంగా తమ ఫలితాలను చెక్ చేసుకోండి.

How To Check AP EAPCET Results

అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి https://cets.apsche.ap.gov.in/ లోకి వెళ్లండి. తర్వాత AP EAPCET Results 2026 పై క్లిక్ చేయండి. వారు అడిగిన వివరాలను ఎంటర్ చేసి మీ ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి.

Leave a Comment