పదవ తరగతి పరీక్ష ఫలితాల తేదీ! AP 10th Results Date 2026

AP 10th Results Date 2026

పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ నెలలోనే విడుదల అవ్వనున్నాయి. ఏప్రిల్ 4 నుండి పదవ తరగతి పేపర్ల మూల్యాంకనం స్టార్ట్ చేయనున్నారు. ఈ AP 10th Results Date 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16, 2026వ తేదీ నుండి స్టార్ట్ కావడం జరిగింది. ఏప్రిల్ 2, 2026వ తేదీతో ముగుస్తాయి. ఈ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల పేపర్లను ఏప్రిల్ 4, 2026 వ తేదీ నుండి ఏప్రిల్ 13, 2026వ తేదీ వరకు మూల్యాంకనం చేయనున్నారు. పేపర్ల మూల్యాంకనం మొత్తంగా 10 రోజులపాటు చేయనున్నారు.

పదవ తరగతి పబ్లిక్ పరీక్షా పేపర్ల మూల్యాంకనం రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో చేయనున్నారు. ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్ రోజుకి 40 పేపర్లను కరెక్షన్ చేయనున్నారు. ఉదయం 20 పేపర్లు, మధ్యాహ్నం 20 పేపర్లను కరెక్షన్ చేయనున్నారు.

ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల తేదీ

ఏప్రిల్ 13 లోపు పరీక్ష పేపర్ల మూల్యాంకనం పూర్తవుతుంది. తర్వాత ఏప్రిల్ 14వ తేదీ నుండి మార్కుల నమోదు ప్రక్రియను ప్రారంభించనున్నారు.

గతేడాది ఏప్రిల్ 23వ తేదీన పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఈ ఏడాది కూడా అదే సమయానికి ఫలితాలను విడుదల చేయాలని విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

అయితే పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు ఏప్రిల్ మూడవ వారం లేదా నాలుగో వారంలో విడుదల అవనున్నాయి.

ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వానికి సంబంధించిన వివరాలు మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment