ఇంటర్ సెకండియర్ క్లాసులు ప్రారంభం! AP Inter Colleges Open 2026

AP Inter Colleges Open 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీల్లో ఏప్రిల్ 1వ తేదీ నుండి సెకండియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఈ AP Inter Colleges Open 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ముగిసాయి. మార్చి 21 నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు పరీక్షా పేపర్ల మూల్యాంకనం జరుగుతుంది. ఇంటర్ పబ్లిక్ పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 21, 2026వ తేదీ లోపల విడుదల కానున్నాయి.

ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల తేదీ

అయితే ఏప్రిల్ 1, 2026 వ తేదీ నుండి ఇంటర్ సెకండియర్ క్లాసులో ప్రారంభం అవనున్నాయి. ఈ ఇంటర్ సెకండియర్ క్లాసులు ఏప్రిల్ 01, 2026వ తేదీ నుండి ఏప్రిల్ 23, 2026వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ క్లాసులు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 వరకు ఉంటాయి.

ఏప్రిల్ 23 తర్వాత విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వడం జరుగుతుంది. మరలా ఇంటర్ కాలేజీలు తిరిగి జూన్ 1, 2026వ తేదీన పున ప్రారంభం అవుతాయి.

అటు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలు జూన్ ఒకటవ తేదీన ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

ఇటువంటి ప్రభుత్వానికి సంబంధించిన వివరాలు మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment