రైతుల అకౌంట్లో డబ్బులు.. జాగ్రత్త పడండి! Annadatha sukhibhava Scheme 2026 telugu

Annadatha sukhibhava Scheme 2026 telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు భారీ శుభవార్త. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి రైతుల అకౌంట్లో త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులను జమ చేయనున్నారు. ఈ Annadatha sukhibhava Scheme 2026 telugu కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమయ్యింది. రాష్ట్రంలోని రైతులు పంట వేయడానికై సిద్ధమవుతున్నారు. పొలం పనులు ప్రారంభం కానున్నాయి. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులను జమ చేయనున్నది.

కూటమి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 20,000 రూపాయలను అందిస్తోంది. అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ 20,000 రూపాయలను రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి రైతులకు అందిస్తోంది.

ఏపీ రాష్ట్రంలో ఇకనుండి స్టీమ్ బియ్యం పంపిణీ

రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ 20,000 రూపాయలను అందిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 14,000 రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6,000 రూపాయలను అందిస్తున్నాయి.

మూడు విడతల కింద ఈ 20వేల రూపాయలను రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారు. మొదటి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు మొత్తంగా 7000 రూపాయలను అందజేస్తారు. రెండవ విడత కింద రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు మొత్తంగా 7,000 రూపాయలను అందజేస్తారు. మూడవ విడత కింద రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు మొత్తంగా 6000 రూపాయలను అందజేస్తారు.

మొదటి విడత కింద 7000+రెండవ విడత కింద 7000+మూడవ విడత కింద 6000= మొత్తంగా 20,000 రూపాయలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందజేస్తున్నాయి.

అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు ఎప్పుడు పడతాయి?

అయితే ఈ సంవత్సరానికి సంబంధించి మొదటి విడత కింద డబ్బులను జూన్ నెలాఖరి లోగా వేయనున్నట్లు సమాచారం.

డిగ్రీ అర్హతతో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు

కేవలం మధ్య మరియు పేద రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇన్కమ్ టాక్స్ చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకి, పరిమితి కంటే ఎక్కువ విద్యుత్తును వినియోగించే వారికి, నాలుగు చక్రాల వాహనం కలిగిన వారికి ఈ పథకం వర్తించదు.

రైతులు జాగ్రత్తపడవలసిన విషయాలు

రైతులు ప్రభుత్వం నుండి డబ్బు జమా కాకముందే కొన్ని విషయాల్లో జాగ్రత్త పడండి.

భూమి ఖాతా, ఆధార్ కార్డు త లింక్ అయి ఉందో లేదో చూసుకోండి.

పీఎం కిసాన్ ఈకేవైసీ పూర్తయిందో లేదో చూసుకోండి.

ఆధార్ కార్డు మరియు బ్యాంకు ఖాతా యాక్టివ్ లో ఉన్నాయో లేదో చూసుకోండి.

మీకు సంబంధించిన వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే రైతు సేవ కేంద్రం, గ్రామ/వార్డు సచివాలయం, అగ్రికల్చర్ ఆఫీసు, రెవిన్యూ ఆఫీస్ వద్దకు వెళ్లి మీ సమస్యను తెలియపరచండి.

రాష్ట్రంఆంధ్రప్రదేశ్
పథకంఅన్నదాత సుఖీభవ
డబ్బులు జమ(సంవత్సరానికి)20,000 రూపాయలు
ఎవరు అర్హులుపేద, మధ్యతరగతి రైతులు.

Official website: https://annadathasukhibhava.ap.gov.in/

అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు ఎప్పుడు జమా కానున్నాయి?

అన్నదాత సుఖీభవ పథకం కింద జూన్ ఆఖరిన డబ్బులు జమా కానున్నాయి.

అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకం కింద ఎన్ని డబ్బులు జమా కానులు ఉన్నాయి?

అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకం కింద సంవత్సరానికి ₹20,000 రైతుల అకౌంట్లో జమవుతాయి.

అన్నదాత సుఖీభవ పథకానికి ఎవరు అర్హులు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు.

అన్నదాత సుఖీభవ పథకం అంటే?

అన్నదాత సుఖీభవ పథకం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద మరియు మధ్యతరగతి రైతులకు పెట్టుబడి సాయంను అందించే పథకం.

3 thoughts on “రైతుల అకౌంట్లో డబ్బులు.. జాగ్రత్త పడండి! Annadatha sukhibhava Scheme 2026 telugu”

Leave a Comment