AP Ration steam rice 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ బియ్యం అక్రమ రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టనుంది. రేషన్ షాపుల్లో ఇప్పుడు పంపిణీ చేస్తున్న బియ్యానికి బదులుగా స్టీమ్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. అలాగే ప్రజల ప్రయోజనార్థం రాష్ట్రంలో 1000 మినీ మార్టులను ఏర్పాటు చేయనున్నారు. ఈ AP Ration steam rice 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే బియ్యం నాణ్యతను దృష్టిలో పెట్టుకొని పేదలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలని లక్ష్యంతో స్టీమ్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 4.3 కోట్ల మంది రేషన్ కార్డు ద్వారా లబ్ధి పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో అర్హులైన వారికి ఒక్కొక్కరికి ఐదు కేజీల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు.
అయితే చాలామంది ఈ రేషన్ కార్డు ద్వారా అందిన బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. దళారులు అక్రమ రవాణా ద్వారా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి వేరే రాష్ట్రానికి పంపిణీ చేస్తున్నారు.
టెన్త్, ఇంటర్, ఐటిఐ అర్హతతో రోడ్లు వేసే సంస్థలో 899 ఉద్యోగాలు
వీరిని దృష్టిలో పెట్టుకొని అక్రమ రవాణా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో భద్రతను ఏర్పరిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు వేల సంఖ్యలో అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం ఈ సమస్యకు చెక్ పెట్టనున్నారు.
రేషన్ షాపుల్లో సాధారణ రేషన్ బియ్యానికి బదులుగా స్టీమ్ బియ్యాన్ని పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అలానే ఈ బియ్యాన్ని పంపిణీ చేయడం ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన బియ్యం అందుతాయి. అలానే ఈ బియ్యం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అలానే అక్రమ రవాణాకు చెక్ పెట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
స్టీమ్ బియ్యాన్ని ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం కింద అమలు చేయనున్నారు. తర్వాత అందులో వచ్చిన రిజల్ట్స్ ను బట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపులకు పంపిణీ చేయనున్నారు.
ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ వివరాలు మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
AP 1000 mini marts
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఇంకో అద్భుతమైన కార్యచరణ కూడా చేపట్టనుంది. రాష్ట్రంలోని పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా 1000 మినీ మార్టులను నిర్మించనుంది.
ఈ మినీ మార్టుల ద్వారా నాణ్యమైన బియ్యం, చక్కెర, గోధుమపిండి, నూనె, మిల్లెట్స్ లాంటి నిత్యవసర సరుకులను తక్కువ ధరకే పొందవచ్చు. నేషనల్ కోపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ (NCCF) భాగస్వామ్యంతో ఈ మినీ మార్టులను ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం సామాన్య ప్రజలు బహిరంగ మార్కెట్లో బియ్యం, పంచదార, నూనె లాంటి నిత్యవసర సరుకులను కొనడం భారంగా మారింది. ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకే రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ఈ కొత్త ఐడియాను తీసుకొచ్చింది.
ఈ మినీ మార్టులను పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు వరం లాగా భావించవచ్చు.
రాష్ట్రంలో ఏ బియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది?
స్టీమ్ బియ్యాన్ని పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని మినీ మార్టులను ప్రారంభించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1000 మినీ మార్టులను ప్రారంభించనున్నారు.
మినీ మార్టుల ప్రత్యేకత ఏమిటి?
మినీ మార్టుల ద్వారా నాణ్యమైన బియ్యం, చక్కెర, గోధుమపిండి మరియు నూనె లాంటి నిత్యవసర సరుకులను తక్కువ ధరకే పొందవచ్చు.
స్టీమ్ బియ్యాన్ని పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భావిస్తోంది?
పేద ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించాలని ఉద్దేశం. అక్రమ రవాణాను నివారించేందుకు.
స్టీమ్ బియ్యాన్ని ముందుగా ఎక్కడ ప్రారంభించనున్నారు?
స్టీమ్ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం పథకం ద్వారా ప్రారంభించనున్నారు.