టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల! TGPSC DEO Recruitment 2026

TGPSC DEO Recruitment 2026

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటులో పని చేసేందుకు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాలు గజిటెడ్ ర్యాంకు ఉద్యోగాలు. ఈ TGPSC DEO Recruitment 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఈ TGPSC DEO Recruitment 2026 ద్వారా 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

ఈ TGPSC DEO Recruitment 2026 కోసం అభ్యర్థులు జూన్ 12, 2026వ తేదీ నుండి జులై 19, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

Age Limit:

18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ TGPSC DEO Recruitment 2026 కీ అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు

ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

Educational Qualification:

ఏదైనా యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా బిఎడ్ కోర్సు కు అర్హత ఇచ్చే సబ్జెక్టుల్లో అయి ఉండాలి.

అలాగే 55 శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ , బీసీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 50% మార్కులతో పాసై ఉంటే సరిపోతుంది.

Selection Process:

రిటర్న్ ఎగ్జామినేషన్ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ రూపంలో ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ కి సంబంధించి ఎగ్జామ్ పాటర్న్ మరియు సిలబస్ ను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ ను అక్టోబర్, 2026లో నిర్వహించడం జరుగుతుంది.

Examination Centres:

హైదరాబాదు

కరీంనగర్

ఖమ్మం

వరంగల్

నిజామాబాద్

How To Apply:

ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి https://www.tgpsc.gov.in లో అప్లై చేసుకోవాలి. జూన్ 12, 2026వ తేదీ నుండి జూలై 19, 2026వ తేదీల మధ్య అప్లై చేసుకోవాలి.

ముందుగా అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయి అప్లై చేసుకోవాలి. ఎటువంటి తప్పులు లేకుండా అప్లై చేసుకోండి.

Application Fee:

అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ: నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 1000 రూపాయలను అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద చెల్లించాలి.

ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 500 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.

ఎగ్జామినేషన్ ఫీజు: అభ్యర్థులు 120 రూపాయలను ఎగ్జామినేషన్ ఫీజు కింద చెల్లించాలి.

నిరుద్యోగులకు ఈ ఎగ్జామినేషన్ ఫీజు లేదు. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఎగ్జామినేషన్ ఫీజును చెల్లించాలి.

Salary:

ఈ నోటిఫికేషన్ కి సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకు 58,850 రూపాయల నుండి 1,37,050 రూపాయల మధ్య బేసిక్ పే ఉంటుంది.

అలాగే అదనంగా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి.

మిగిలిన పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

Notification PDF

Official Website: https://www.tgpsc.gov.in

Leave a Comment