ఏపీ అంగన్వాడిలో ఇండక్షన్ స్టవ్ లు పంపిణీ! AP Anganwadi induction stove

AP Anganwadi induction stove

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్వాడీలకు శుభవార్త. గ్యాస్ కొరతను అధికమించడానికి రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్ లను పంపిణీ చేయనున్నారు. ఈ AP Anganwadi induction stove కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

పచ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ వ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ కారణంగా భారతదేశంలో కూడా గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది.

గ్యాస్ కొరతను అధిగమించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. రాష్ట్రంలోని అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్ లను పంపిణీ చేయనున్నారు.

ఈ సందర్భంగా ఇదివరకే మొదటి విడత కింద 11,400 ఇండక్షన్ స్టవ్ లను పంపిణీ చేయడం జరిగింది.

అన్నదాత సుఖీభవ రైతులకు ₹20,000

మిగిలిన 44,346 ఇండక్షన్ స్టవ్ లను అంగన్వాడీలకు జూన్ 20, 2026 వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది.

గ్యాస్ సిలిండర్లతో పోలిస్తే ఇండక్షన్ స్టవ్ లను వాడడం ద్వారా ప్రభుత్వానికి డబ్బులు ఆదా కానున్నాయి. సంవత్సరానికి 24 కోట్ల రూపాయల వరకు ఆధా కానున్నట్లు అంచనా వేశారు.

అదేవిధంగా గ్యాస్ స్టవ్ తో పోలిస్తే ఇండక్షన్ స్టవ్ పై వండడం కాస్త సులువు. అలాగే పర్యావరణంనీ హాని చేసే కార్బన్ డయాక్సైడ్ వాయువు అధిక మొత్తంలో విడుదల అవ్వదు. ఈ పద్ధతి ద్వారా ఏటా 28,327 టన్నుల కార్బన్ డయాక్సైడ్ పర్యావరణం లోకి విడుదల కాకుండా నివారించవచ్చు.

సాధారణ ఎల్పీజీ గ్యాస్ స్టవ్ లతో పోలిస్తే ఇండక్షన్ స్టవ్ లు 30% ఎక్కువ శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ పద్ధతి ద్వారా సమయాన్ని ఆదా చేయవచ్చు.

ఒక్కో అంగన్వాడి కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ తో పాటు కావలసిన వంట సామాగ్రిని కలిపి కిట్టుగా అందజేస్తున్నారు. ఈ కిట్ విలువ సుమారు 7000 రూపాయలు ఉంటుంది.

అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్ లను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 62 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది.

1 thought on “ఏపీ అంగన్వాడిలో ఇండక్షన్ స్టవ్ లు పంపిణీ! AP Anganwadi induction stove”

Leave a Comment