CSIR – CCMB Recruitment 2026
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) కింద పనిచేస్తున్నటువంటి సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(CCMB) నుండి టెక్నీషియన్ మరియు డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ CSIR – CCMB Recruitment 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ CSIR – CCMB Recruitment 2026 ద్వారా
టెక్నీషియన్ గ్రేడు -II: 23 పోస్టులు
డ్రైవర్ – 1 పోస్టును భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ CSIR – CCMB Recruitment 2026 కోసం అభ్యర్థులు ఏప్రిల్ 28, 2026వ తేదీ నుండి మే 26, 2026వ తేదీ లోగా అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవాలి.
ఏపీలో 5,000 అంగన్వాడీ ఉద్యోగాలు.
Age Limit:
టెక్నీషియన్: 18 సంవత్సరముల నుండి 28 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
డ్రైవర్: 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరములు మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరముల ఐదు రిలాక్సేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కి సంబంధించి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి. సంబంధిత ట్రేడ్లో ఐటిఐ సర్టిఫికెట్ను అడగడం జరిగింది. పూర్తి వివరాలు అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
Selection Process:
ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్/కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ను నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
How To Apply:
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి https://www.ccmb.res.in లో ఏప్రిల్ 28, 2026వ తేదీ నుండి మే 26, 2026వ తేదీ లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. తరువాత ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసుకున్న అప్లికేషన్ ఫారం మరియు మరికొన్ని డాక్యుమెంట్స్ తో ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. జూన్ 5, 2026వ తేదీలోగా మీ డాక్యుమెంట్స్ ఇచ్చిన అడ్రస్ కి వెళ్లే లాగా అప్లై చేసుకోవాలి.
ఆఫ్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
Application Fee:
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Official Website: https://www.ccmb.res.in