భారత్లో తగ్గిన నిరుద్యోగ రేటు
భారత్ లో నిరుద్యోగ రేటు తగ్గుతోందని ఒక సర్వే తెలిపింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నిరుద్యోగ రేటు తగ్గుతోందని తెలిపింది.
నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీసు సర్వే ప్రకారం దేశంలో నిరుద్యోగ రేటు తగ్గుతుందని తెలుస్తోంది. ఈ సర్వే ప్రకారం జులై లో భారత్లో నిరుద్యోగ రేటు 5.5 శాతం నుండి 5.1 శాతానికి పడిపోయిందని తెలిపింది.
చంద్రబాబు నాయుడు: పంటల బీమా చేసుకోండి
గ్రామాల్లో అయితే నిరుద్యోగ రేటు 5 శాతం నుండి 4.5% కు తగ్గింది. ఈ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు బాగా తగ్గిందని తెలుస్తోంది.
పట్టణాల్లో అయితే నిరుద్యోగ రేటు 6.6 శాతం నుండి 6.7 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు స్వల్ప స్థాయిలో పెరిగింది.