AP TET Hall Tickets 2026
AP TET Hall Tickets 2026: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(AP TET) పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఈ ఏపీ టెట్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను జూలై 25, 2026వ తేదీన విడుదల చేయడం జరిగింది.
ఏపీ టెట్ 2026 నోటిఫికేషన్ జూన్ నెలలో విడుదల కావడం జరిగింది. ఈ టెట్ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు జూన్ 5, 2026వ తేదీ నుండి జూలై 5, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకున్నారు.
ఈ ఏపీ టెట్ నోటిఫికేషన్ కోసం 2,13,520 మంది అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది. మొత్తంగా 2,37,165 అప్లికేషన్లు సమర్పించబడ్డాయి.
నిరుద్యోగులకు శుభవార్త..3168 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ మార్కులకి 20% వెయిటేజీ ఉంది. డీఎస్సీ టీచర్ ఉద్యోగం సంపాదించాలి అంటే టెట్ మార్కులు కీలకం వ్యవహరిస్తాయి.
AP TET పరీక్షలు ఆగస్టు 5, 2026వ తేదీ నుండి ఆగస్టు 21, 2026వ తేదీ మధ్య రోజుకు రెండు సెషన్ల మాదిరి జరగనున్నాయి. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్. మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్ జరగనున్నాయి.

అయితే తాజాగా AP TET Hall Tickets 2026 విడుదల కావడం జరిగింది. ఏపీ టెట్ నోటిఫికేషన్ కి ఎవరైతే అప్లై చేసుకున్నారో అభ్యర్థులు తమ హాల్ టికెట్లను క్రింది విధంగా డౌన్లోడ్ చేసుకోండి.
ముందుగా అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి https://tet2dsc.apcfss.in/ లోకి వెళ్ళండి. అక్కడ క్యాండిడేట్ లాగిన్ పై క్లిక్ చేయండి. యూసర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. తర్వాత సర్వీసెస్ పై క్లిక్ చేయండి. తర్వాత AP TET Hall Ticket పై క్లిక్ చేయండి. అభ్యర్థులు మీ హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు ఇన్స్ట్రక్షన్స్ ను చదువుకోండి.
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |