ఏపీలో 1.08 కోట్ల బీపీ, షుగర్ బాధితులు! AP Health News 2026

AP Health News 2026

AP Health News 2026: బిపి, షుగర్ వ్యాధులు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శాఖ నిర్వహించిన ఆరోగ్యపరీక్షల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రాష్ట్రవ్యాప్తంగా తాజాగా ఆరోగ్యశాఖ వైద్య పరీక్షలను నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ తాజా సర్వే ఆధారంగా 59.63 లక్షల మంది బిపి (బ్లడ్ ప్రెషర్) తో, 48.95 లక్షలమంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. అయితే ఇందులో సుమారు 34 లక్షల మంది బీపీ మరియు షుగర్ రెండు వ్యాధులతో బాధపడుతున్నట్లు తేలింది.

తాజాగా నిర్వహించిన ఈ వైద్య పరీక్షల్లో నూతనంగా 12,23,185 బిపి పేషెంట్లను, 11,58,632 షుగర్ పేషెంట్లు నమోదు కావడం జరిగింది.

ఏపీ డీఎస్సీ ఫుల్ నోటిఫికేషన్ 2026

వీరికి బీపీ, షుగర్ ఉన్నప్పటికీ ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో తమ రోజువారి పనులను యధాతధంగా చేసుకునేవారు. ఇలాంటి వారిని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే పరీక్షలను నిర్వహించి గుర్తించింది.

ఈ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 18 సంవత్సరాలు పైబడిన 2 కోట్ల 85 లక్షల మందికి వైద్య పరీక్షలను నిర్వహించడం జరిగింది.

బిపి, షుగర్, నోటి క్యాన్సర్ తో పాటు మహిళల ఆరోగ్యంను దృష్టిలో పెట్టుకొని రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలను నిర్వహించడం జరిగింది.

ఈ టెస్టుల్లో 12,768 క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 3,339 నోటి క్యాన్సర్ కేసులు, 5,832 రొమ్ము క్యాన్సర్ కేసులు, 3,597 గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు ఉన్నాయి.

ఈ కార్యక్రమం ద్వారా వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి, తగిన వైద్య సేవలు అందించడం.

Whatsapp Channel

Leave a Comment