Today gold rate in Hyderabad
Today gold rate in Hyderabad: బంగారం, వెండి కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి మంచి ఊరట కలిగించే శుభవార్త. మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టాయి.
బంగారం, వెండి ధరలు గత నెల రోజుల నుండి తగ్గుతూ వస్తున్నాయి. నిన్న, నేడు కూడా భారీగా తగ్గాయి.
నిన్న అంటే నవంబర్ 18 వ తేదీన 24 క్యారెట్ల బంగారు ధర 2,780 రూపాయలు తగ్గి 1,33,260 రూపాయలుగా పలికింది. నేడు నవంబర్ 19వ తేదీన 2,570 రూపాయలు తగ్గి 1,30,690 రూపాయలకు చేరింది.
ఏపీ ప్రభుత్వం: నవంబర్ 26న సెలవు
నవంబర్ 18 వ తేదీన 22 క్యారెట్ల బంగారు ధర 2550 తగ్గి 1,22,150 రూపాయలు గా పలికింది. నేడు నవంబర్ 19వ తేదీన 2350 రూపాయలు తగ్గి 1,19,800 రూపాయలకు చేరింది.
అలాగే కేజీ వెండి ధర నిన్న నవంబర్ 18వ తేదీన 5000 పడిపోయి 1,85,000 కు అమ్ముడు అయ్యింది. నేడు నవంబర్ 19వ తేదీన కూడా 5000 తగ్గి 1,80,000 కు అమ్ముడవుతోంది.

ఈ సంవత్సరం జనవరి 1న 1,35,060 రూపాయలు పలికిన బంగారు ధర జనవరి 29న గరిష్టంగా 1,78,850 రూపాయలకి ఎగబాకింది. ఈ సంవత్సరంలో ఇదే అత్యధికం.
పది నెలల తర్వాత బంగారు ధరలు కనిష్టానికి చేరాయి. ఈరోజు 1,30,690 రూపాయలకు చేరడంతో ఇదే ఈ సంవత్సరంలో కనిష్ట ధర గా నమోదయింది.
అలాగే కేజీ వెండి ధర జనవరి 1న 2.56 లక్షలు గా పలికి, జనవరి 29 నాటికి 4.25 లక్షలకు ఎగబాకింది.
మరల నేడు నవంబర్ 19వ తేదీన కనిష్టంగా 1.80 లక్షలకు పడిపోయింది.