APPSC Group 2 Notification 2026:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నుండి గ్రూప్ – 2 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ గ్రూప్ – 2 ఫుల్ నోటిఫికేషన్ నవంబర్ 10, 2026వ తేదీన విడుదల కావడం జరిగింది. ఈ APPSC Group 2 Notification 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ – 2 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ APPSC GROUP 2 NOTIFICATION 2026 ద్వారా 720 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. మొత్తంగా 30 డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
పోస్టుల వైస్ గా, జోన్ వైజ్ గా పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
టెన్త్ పరీక్షా షెడ్యూల్ 2027
ఈ APPSC Group 2 Notification 2026 కోసం అభ్యర్థులు నవంబర్ 10, 2026వ తేదీ నుండి డిసెంబర్ 11, 2026వ తేదీ రాత్రి 11:59 గంటల లోపు అప్లై చేసుకోవాలి.
Age Limit:
జూలై 1, 2026వ తేదీ నాటికి 18 సంవత్సరముల నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ APPSC Group 2 Notification 2026 కి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు అందరూ ఈ APPSC Group 2 Notification 2026 కి అప్లై చేసుకోవచ్చు.
Selection Process:
- స్క్రీనింగ్ టెస్ట్
2. మెయిన్ ఎగ్జామినేషన్
3. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT)
స్క్రీనింగ్ టెస్ట్‌ను ఫిబ్రవరి 21, 2026వ తేదీన నిర్వహించడం జరుగుతుంది.
How To Apply:
ముందుగా అభ్యర్థులు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) చేసుకోవాలి. తర్వాత OTPR ఐడితో లాగిన్ ఐ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ పై క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి.
అభ్యర్థులు యాక్టివ్ లో ఉన్న మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి తో అప్లై చేసుకోండి. ఎటువంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. అప్లై లాస్ట్ డేట్ డిసెంబర్ 11, 2026.
Application Fee:
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద 250 రూపాయలను మరియు ఎగ్జామినేషన్ ఫీజును 80 రూపాయలను చెల్లించాలి. మొత్తం 330 రూపాయలను ఫీజు కింద చెల్లించి అప్లై చేసుకోవాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు మరియు ఎక్సెస్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు లేదు. కేవలం అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 250 రూపాయలను చెల్లించి అప్లై చేసుకోవచ్చు.
Examination Centres:
శ్రీకాకుళం
విజయనగరం
పార్వతీపురం మన్యం
అల్లూరి సీతారామరాజు
విశాఖపట్నం
అనకాపల్లి
కాకినాడ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ
ఈస్ట్ గోదావరి
వెస్ట్ గోదావరి
ఏలూరు
కృష్ణ
ఎన్టీఆర్
గుంటూరు
పల్నాడు
బాపట్ల
ప్రకాశం
ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు
చిత్తూరు
తిరుపతి
అన్నమయ్య
వైయస్సార్ కడప
శ్రీ సత్యసాయి
అనంతపురం
నంద్యాల
కర్నూలు
Full Notification
Official Website: https://portal-psc.ap.gov.in/
5 thoughts on “గ్రూప్ 2 ఫుల్ నోటిఫికేషన్! APPSC Group 2 Notification 2026”