పదవ తరగతి పరీక్ష ఫీజు! AP 10th Exam Fee 2027

AP 10th Exam Fee 2027

AP 10th Exam Fee 2027: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థులకు ముఖ్య సమాచారం తెలియజేసింది. 2027 మార్చిలో నిర్వహించనున్న పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు వివరాలను విడుదల చేసింది. ఈ AP 10th Exam Fee 2027 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

2027లో జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు కావాలనుకున్న రెగ్యులర్ విద్యార్థులు, గతంలో ఫెయిల్ అయ్యి మరల మార్చిలో రాయాలనుకుంటున్న విద్యార్థులు కచ్చితంగా ఇప్పుడు ఫీజు చెల్లించాలి.

ఈ AP 10th Exam Fee 2027 కోసం విద్యార్థులు నవంబర్ 11, 2026వ తేదీ నుండి నవంబర్ 25, 2026వ తేదీ మధ్య ఫీజు చెల్లించాలి. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు లేదా అన్ని సబ్జెక్టులు రాసే విద్యార్థులు 125 రూపాయలను ఫీజు కింద చెల్లించాలి. మూడు సబ్జెక్టుల లోపు రాసే విద్యార్థులు 110 రూపాయలు చెల్లించాలి.

అలానే వయస్సు మినహాయింపు కోరుకునే విద్యార్థులు 300 రూపాయలను చెల్లించాలి.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ నోటిఫికేషన్ విడుదల

నవంబర్ 26, 2026వ తేదీ నుండి డిసెంబర్ 2, 2026 వ తేదీ మధ్య 50 రూపాయలు అపరాధ రుసుముతో ఫీజు చెల్లించవచ్చు.

డిసెంబర్ 3, 2026వ తేదీ నుండి డిసెంబర్ 9, 2026వ తేదీ మధ్య 200 రూపాయలు అపరాధ రుసుముతో ఫీజు చెల్లించవచ్చు.

డిసెంబర్ 10, 2026వ తేదీ నుండి డిసెంబర్ 15, 2026వ తేదీ మధ్య 500 రూపాయలు అపరాధ రుసుముతో ఫీజు చెల్లించవచ్చు.

విద్యార్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా త్వరగా ఫీజు చెల్లించండి.

పరీక్ష ఫీజు ఎలా చెల్లించాలి?

విద్యార్థులు తమ ఫీజును పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేయండి. వారు స్కూల్ లాగిన్ ద్వారా ఆన్లైన్లో చెల్లిస్తారు.

విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించే ముందు తమ వివరాలను సరిచూసుకోండి.

AP SSC Exam Fee 2027

పరీక్ష పేరుఏపీ పదవ తరగతి పబ్లిక్ పరీక్ష
ఎగ్జామ్ టైంమార్చి 2027
ఫీజు ప్రారంభ తేదీనవంబర్ 11, 2026
ఫీజు లాస్ట్ తేదీనవంబర్ 25, 2026
సాధారణ ఎక్సమ్ ఫీజురూ. 125
మూడు సబ్జెక్టుల వరకు ఫీజురూ. 110
ఆలస్య రుసుముతో చివరి తేదీడిసెంబర్ 15, 2026

Official Website: Https://bse.ap.gov.in/

Leave a Comment