నవంబర్ 26న సెలవు! ప్రభుత్వ ప్రకటన! AP Holiday November 26

AP Holiday November 26

AP Holiday November 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నవంబర్ 26, 2026వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకి సెలవు ప్రకటించడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 23 పట్టణ స్థానిక సంస్థలకు నవంబర్ 26న ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 4 నగరపాలక సంస్థలు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 26న సెలవు ప్రకటించడం జరిగింది.

అయితే ఈ సెలవు రాష్ట్రవ్యాప్తంగా ఉండదు. ఎన్నికలు జరిగే ప్రాంతాల పరిధిలో మాత్రమే వర్తిస్తుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం స్థానిక సెలవు ప్రకటించింది.

ఏపీ : తహసిల్దార్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా ప్రైవేట్ ఉద్యోగులకు సెలవు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

నవంబర్ 26న సెలవు ప్రకటించారనే సమాచారంతో రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ సెలవు ఉంటుందని భావించకండి. కేవలం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మాత్రమే సెలవు ప్రకటించడం జరిగింది.

కాబట్టి ఉద్యోగులు తమ పని చేసే ప్రాంతానికి ఈ సెలవు వర్తిస్తుందో లేదో సంబంధిత జిల్లా అధికారుల ఉత్తర్వుల ద్వారా తెలుసుకోవడం మంచిది.

Whatsapp Channel

1 thought on “నవంబర్ 26న సెలవు! ప్రభుత్వ ప్రకటన! AP Holiday November 26”

Leave a Comment