ఏపీలో డిసెంబర్ 3 నుంచి 5 వరకు ప్రత్యేక టీకాలు! Td Vaccine Drive 2026

Td Vaccine Drive 2026

Td Vaccine Drive 2026: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పిల్లల ఆరోగ్యం ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇంకో కార్యక్రమానికి సిద్ధమయ్యింది. పిల్లలకు ఆరోగ్య రక్షణ కల్పించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా టీకాలను వేయనున్నారు.

డిఫ్తీరియా, ధనుర్వాతం లాంటి వ్యాధుల నుండి పిల్లలకు ఆరోగ్య రక్షణ కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా టీకాలను వేయనుంది.

10 సంవత్సరములు నిండిన పిల్లలకు, 16 సంవత్సరములు నిండిన పిల్లలకు ఈ టీకాలను వేయనున్నారు. డిసెంబర్ 3, 4, 5 వ తేదీల్లో ఈ టీకాల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది.

10 సంవత్సరములు పూర్తి చేసుకున్న పిల్లలకు Td-10 టీకాను, 16 సంవత్సరములు పూర్తి చేసుకున్న పిల్లలకు Td-16 టీకాను వేయనున్నారు.

గ్రూప్ 2 ఫుల్ నోటిఫికేషన్ 2026

పాఠశాలలు, కళాశాలల్లో ఈ కార్యక్రమం ను నిర్వహించనున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులతో పాటు చదువుకు దూరంగా ఉన్న పిల్లలు కూడా ఈ టీకాలను వేయించుకోవాలి.

తల్లిదండులకు సూచన:

మీ పిల్లలకు 10, 16 సంవత్సరాలు నిండాయో లేదో పరిశీలించండి.
గతంలో ఇటువంటి టీకా తీసుకున్నారో లేదో తెలుసుకోండి.
టీకాకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే వైద్యులను అడిగి తెలుసుకోండి.
పిల్లల టీకా రికార్డులను అందుబాటులో ఉంచుకోండి.

తల్లిదండ్రులు ఆరోగ్యశాఖ సూచనలను పాటిస్తూ తమ పిల్లలకు అవసరమైన టీకాలు అందేలా చూడండి.

Whatsapp Channel

1 thought on “ఏపీలో డిసెంబర్ 3 నుంచి 5 వరకు ప్రత్యేక టీకాలు! Td Vaccine Drive 2026”

Leave a Comment