AP Job Calendar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనీ 19 యూనివర్సిటీలు మరియు RGUKT లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ AP Job Calendar Universities Notification 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్ లో భాగంగా మొదటి నోటిఫికేషన్ మే 15న విడుదల అయింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోనీ యూనివర్సిటీలో మరియు RGUKT లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తంగా 1523 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా..
ప్రొఫెసర్ – 63 పోస్టులు
అసోసియేట్ ప్రొఫెసర్ – 334
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 1,020
లెక్చరర్ (RGUKT) – 104 పోస్టులు
పదవ తరగతి అర్హతతో MTS ఉద్యోగాలు.
మొత్తంగా 1523 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. యూనివర్సిటీల వారీగా పోస్టుల వివరాలను అఫీషియల్ వెబ్సైటు లోకి వెళ్లి చూసుకోండి.
ఈ నోటిఫికేషన్ మే 15, 2026వ తేదీన విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కోసం మే 18, 2026వ తేదీ నుండి జూన్ 8, 2026 వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. హార్డ్ కాపీ సమర్పించడానికి చివరి తేదీ జూన్ 15, 2026.
జూలై 1, 2026వ తేదీ నాటికి 18 సంవత్సరముల నుండి 44 సంవత్సరముల మధ్య వయసు కలిగి ఉంటే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
మిగిలిన పూర్తి వివరాలను అఫీషియల్ వెబ్సైటులో చూసుకోండి.
Official Website: https://apuniversitiesrecruitment.apcfss.in/
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ విడుదల అవగానే తెలియాలి అంటే మన వాట్సప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |