AP, TS Schools, Colleges Opening Date 2026
AP, TS Schools, Colleges Opening Date 2026: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభమయ్యే సమయం ఆసన్నమైంది. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సెలవులు ముగియనున్నాయి.
ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు సెలవులు ఇవ్వడం జరిగింది. అలానే వేసవికాలం ముగియనుంది అలానే సెలవులు కూడా ముగియనున్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ పాఠశాలలు, కళాశాలలు ఎప్పుడు తెరుస్తారు అని చూస్తున్నారు.
Inter Colleges Opening Date 2026
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ విద్యార్థులకు సెలవులను ఏప్రిల్ 24, 2026వ తేదీ నుండి ఇవ్వడం జరిగింది. కళాశాలలు తిరిగి జూన్ 1, 2026వ తేదీన పునః ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. జూన్ ఒకటవ తేదీ నుండి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి.
2026 – 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు 232 రోజులు కళాశాలలు జరగనున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో చూస్తే 2026 – 2027 క్యాలెండర్ ప్రకారం 224 రోజులు కళాశాలలు తెరవబడతాయి.
తల్లికి వందనం పథకం కింద ₹13,000 మీ అకౌంట్లో పడతాయో లేదో స్టేటస్ చెక్ చేసుకోండి.

Schools Opening Date 2026
రెండు తెలుగు రాష్ట్రాల్లో పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 24, 2026 వ తేదీ నుండి సెలవులు ఇవ్వడం జరిగింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు జూన్ 12, 2026వ తేదీన పున ప్రారంభం కానున్నాయి. జూన్ 11, 2026వ తేదీతో వేసవి సెలవులు ముగియనున్నాయి.
| Schools Opening Date | జూన్ 12, 2026 |
| Colleges Opening Date | జూన్ 01, 2026 |
తల్లిదండ్రులకు గమనిక:
తల్లిదండ్రులు తమ పిల్లలను మొదటి రోజు నుండి పాఠశాలలకు పంపండి. విద్యా క్యాలెండర్ ప్రకారం ముందు నుండి టైం టేబుల్ వేసుకొని పిల్లలను చదివించండి.
పిల్లలను ఎటువంటి పనులకు పంపకండి. ఎవరైనా పిల్లలు పనికి వెళుతూ ఉంటే వాళ్లకి నచ్చజెప్పి బడికి పంపండి.
పిల్లల ఆరోగ్యాన్ని ఎప్పుడూ గమనిస్తూ ఉండండి.
ఏపీ రాష్ట్రంలో పాఠశాలలు ఓపెనింగ్ తేదీ 2026?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలను జూన్ 12వ తేదీన ఓపెన్ చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు ఓపెనింగ్ తేదీ 2026?
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు జూన్ 12వ తేదీ ఓపెన్ కానున్నాయి.
ఏపీ రాష్ట్రంలో ఇంటర్ కళాశాలలు ఓపెనింగ్ తేదీ 2026?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ కళాశాలలు జూన్ 1వ తేదీన ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ కళాశాలలు ఓపెనింగ్ తేదీ 2026?
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ కళాశాలలు జూన్ 1, 2026వ తేదీన ఓపెన్ కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ కళాశాలలు 2026-27 సంవత్సరానికి గాను ఎన్ని రోజులు పని చేయనున్నాయి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026 – 27 సంవత్సరానికి గాను 232 రోజులు కళాశాలలు ఓపెన్ లో ఉంటాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలు 2026 – 27 సంవత్సరానికి గాను ఎన్ని రోజులు ఓపెన్ ఉంటాయి?
తెలంగాణ రాష్ట్రంలో 2026 – 27 సంవత్సరానికి గాను 224 రోజులు కళాశాలలు ఓపెన్ లో ఉంటాయి.
1 thought on “స్కూల్స్, కాలేజెస్ ఓపెనింగ్ తేదీలు! AP, TS Schools, Colleges Opening Date 2026”