ఏఐ ప్రభావం.. 12వేల కోర్సులు ఎత్తివేత

ఒకప్పుడు ఏదైనా డిగ్రీ చదివితే ఎక్కడో ఒకచోట ఉద్యోగం దొరికేది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. మారుతున్న కాలం దృష్ట్యా కాలేజీల్లో భారీగా కొత్త కోర్సులు పుట్టుకొస్తున్నాయి.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI) ఎప్పుడైతే పుట్టుకు వచ్చిందో అప్పటినుండి ప్రతి రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయా కళాశాలలు మునుపటి కోర్సులను రద్దుచేసి, వాటి స్థానంలో కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నారు.

ఈ సందర్భంగా చైనా తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా ఆయా దేశాలను ఆలోచింపజేస్తోంది. మారుతున్న కాలం దృశ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను దృష్టిలో పెట్టుకొని 12,200 అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులను తొలగించి, నూతనంగా 10,200 కోర్సులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా యూనివర్సిటీల్లో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. యూనివర్సిటీలోని మొత్తం కోర్సుల్లో 30% కోర్సుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్వాడీల్లో ఇండక్షన్ స్టవ్ లు పంపిణీ.

తొలగించిన కోర్సులు:

• ARTS (కలలు)

• Foreign Languages (విదేశీ భాషలు)

• Management Studies (నిర్వహణ విద్య)

తదితర కోర్సులను పూర్తిగా తొలగించారు. ఈ కోర్సులను తొలగించడానికి కారణం ఈ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లేకపోవడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఈ కోర్సులపై పడడం.

నూతనంగా ప్రారంభించిన కోర్సులు:

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏంబోడేడ్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్, స్మార్ట్ ఇంజనీరింగ్, ఇంటెలిజెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తదితర కోర్సులను నూతనంగా ప్రారంభించారు.

అయితే చైనాలోని యూనివర్సిటీలో కోర్సుల్లో భారీగా మార్పులు చేయడానికి గల కారణం దేశంలోని నిరుద్యోగ యువత పెరగడం. దేశంలో 16 శాతానికి పైగా నిరుద్యోగ యువత పెరగడం. అలాగే కాలానికి అనుగుణంగా అప్డేట్ అవుతూ ఉండడం.

ఇకనుండి డిగ్రీని కేవలం పట్టా కోసం కాకుండా స్కిల్ నేర్చుకోవడానికి చదవాల్సి ఉంటుంది అని నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో ఏదో ఒక డిగ్రీ చదివితే సరిపోతుంది అనుకునేవారు, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. కాలానికి అనుగుణంగా అలవాటులను మార్చుకోవాలి.