AP Inter Re-Verification, Re-Counting Dates 2026
AP Inter Re-Verification, Re-Counting Dates 2026: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలకు సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఫెయిల్ అయిన మరియు తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు రి వెరిఫికేషన్ మరియు రి కౌంటింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు మే 21, 2026వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు జూన్ 18, 2026వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కావడం జరిగింది.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 1,09,003 మంది ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షలు రాయగా 42,379 మంది విద్యార్థులు పాసయ్యారు. పాస్ పర్సంటేజ్ 39% గా నమోదు అయ్యింది.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 2,29,034 మంది విద్యార్థులు బెటర్మెంట్ పరీక్షలు రాయగా 1,35,435 మంది విద్యార్థులు మార్కులను మెరుగుపరుచుకున్నారు.
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం 91,303 మంది విద్యార్థులు బెటర్మెంట్ పరీక్షలు రాయగా 48,149 మంది విద్యార్థులు మార్కులను మెరుగుపరుచుకున్నారు.
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం 1,02,018 మంది విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షలు రాయగా 57,327 మంది విద్యార్థులు పాసయ్యారు. పాస్ పర్సంటేజ్ 56% గా నమోదు అయ్యింది.
విద్యార్థులు తమ మార్కులపై అసంతృప్తిగా ఉంటే రీ వెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ ఆప్షన్స్ ను సద్వినియోగం చేసుకోండి. ఇందుకోసం విద్యార్థులు జూన్ 26, 2026వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్టు కు రూ.1300 చొప్పున చెల్లించి అప్లై చేసుకోవాలి.
రీకౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ. 260 చొప్పున చెల్లించి అప్లై చేసుకోవాలి.
| బోర్డు | బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ |
| రీ వెరిఫికేషన్ ఒక్కో సబ్జెక్టుకు(రూ.) | రూ.1300 |
| రీ కౌంటింగ్ ఒక్కో సబ్జెక్టుకు(రూ.) | రూ.260 |
| అప్లై చివరి తేదీ | జూన్ 26, 2026 |
Official Website: https://resultsbie.ap.gov.in/